IPL 2022 GT vs MI: ముంబై రెండో విజయాన్ని నమోదు చేస్తుందా ..?

IPL 2022 GT vs MI: ఐపీఎల్‌ లో శుక్రవారం మరో ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌ జరగనుంది. బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తో ఢీకొట్టనుంది. ఈ సీజన్‌ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు తలపడలేదు. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది?

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 07:38 PM IST
  • శుక్రవారం గుజరాత్‌ తో ముంబై ఢీ
  • ఇప్పటివరకు ఒక్కటే మ్యాచ్‌ గెలిచిన ముంబై
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌
IPL 2022 GT vs MI: ముంబై రెండో విజయాన్ని నమోదు చేస్తుందా ..?

IPL 2022 GT vs MI: ఐపీఎల్‌ లో శుక్రవారం మరో ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌ జరగనుంది. బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తో ఢీకొట్టనుంది. ఈ సీజన్‌ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు తలపడలేదు. అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు.. ఆల్ రౌండర్‌ ప్రదర్శనతో దూసుకెళ్తోంది. హార్ధిక్‌ పాండ్యా నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 8 గెలిచింది. 16 పాయింట్లతో పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఇక ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు ఈ సీజన్‌ లో చెత్త ప్రదర్శనను మూటగట్టుకుంది. ఇప్పటివరకు ముంబై ఆడిన 9 మ్యాచుల్లో ఒక్కటే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో చిట్టచివరిన ఉంది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌ లో గెలిచి ముంబై ఈ సీజన్‌ లో తొలి విజయాన్ని రుచిచూసింది. అయితే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న గుజరాత్‌ ను ఢీకొట్టాలంటే ముంబై జట్టు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన చేస్తేనే టేబుల్‌ టాపర్‌ ను టేబుల్‌ లీస్ట్‌ లో ఉన్న జట్టు ఓడించడం సాధ్యమవుతోంది.

ముంబై బ్యాటింగ్‌ లో రోహిత్‌, ఇషాన్‌ కిషాన్‌ బలమైన ఒపెనింగ్‌ ఇవ్వలేకపోతున్నారు. ఆ తర్వాత వస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ కొంచెం పర్వాలేదనిపిస్తున్నారు. ఇక ఎంతో నమ్మకం పెట్టుకున్న  కీరన్‌ పోలార్డ్‌ మాత్రం ఇప్పటివరకు ఒక్క హాప్‌ సెంచరీ కూడా నమోదు చేయలేదు. తొమ్మిది మ్యాచ్‌ లు ఆడిన పోలార్డ్‌ కేవలం 125 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్ విభాగంలో ఎంత నమ్మకం పెట్టుకున్న బుమ్రా కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. తొమ్మిది మ్యాచుల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది ముంబై ఇండియన్స్‌ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనను మిస్‌ అవుతోంది. అందుకే వరుసగా ఘోర పరాజయాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.

ఇక గుజరాత్‌ టీం గురించి మాట్లాడుకుంటే వృద్ధిమాన్‌ సాహా, శుభమన్‌ గిల్‌ మధ్య మంచి ఓపెనింగ్‌ పార్టనర్‌ షిప్‌ ఉంది. ఆ  తర్వాత వచ్చే సాయి సుదర్శన్‌ కూడా బ్యాటుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా ఆడిన 9 మ్యాచుల్లో 309 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. అటు గుజరాత్‌ బౌలింగ్‌ కు ప్రధాన బలం మహ్మద్‌ షమీ, లూకీ ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌ అని చెప్పుకోవాలి. షమీ 15, లూకీ ఫెర్గూసన్‌ 11, రషీద్‌ ఖాన్‌ 9 వికెట్లు వికెట్లు పడగొట్టారు. మొత్తంగా ఎంతో బలంగా కనిపిస్తున్న గుజరాత్‌ పై పైచేయి సాధించాలంటే ముంబై ఎంతో శ్రమించాల్సిందే.

Also Read: Msk Team For T20 World Cup: రోహిత్, కోహ్లీ, రాహుల్ ఫిక్స్, మరి శిఖర్ దావన్..? 

Also Read: Harbhajan Singh: ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టును ప్రకటించిన భజ్జీ.. ఎవరెవరికి చోటు దక్కిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News