Kings xi Punjab vs Gujarat Lions: ఐపీఎల్-2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్- మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్లు బ్రబౌర్న్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలవాలని ఇరు జట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇవాళ రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి జోరు కనబరుస్తోంది. అటు పంజాబ్ జట్టు సైతం ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట గెలిచి మంచి ఫామ్ లో కనబడుతోంది. పంజాబ్ తన చివరి మ్యాచ్ లో సీఎస్‌కే ను ఓడించి ఉత్సాహంతో ఉంది.
గుజరాత్ జట్టులో పేస్ బౌలర్లకు కొదవలేదు. ముఖ్యంగా మహ్మద్ షమీ, న్యూజిలాండ్ ఆటగాడు ఫెర్గూసన్ లతో పేస్ విభాగం బలంగా కనబడుతోంది. అటు కెప్టెన్ హర్ధిక్ పాండ్యాతో పాటు స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో శుభమన్ గిల్ టచ్ లోకి వచ్చాడు. గత ఇన్నింగ్స్ లో ఆడినట్టుగానే ఇవాళ్టి మ్యాచ్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. హర్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్ లాంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్ బాధ్యతను మోస్తారు.
ఇక పంజాబ్ కింగ్స్ కు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ లతో కూడిన అద్భుతమైన ఓపెనింగ్ జోడి ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో భానుక రాజపక్సే, లివింగ్ స్టోన్, షారూఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్ ఉన్నారు. రబడా, రాహుల్ చాహర్, వరుణ్ అరోన్, అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లతో బౌలింగ్ విభాగంలో పంజాబ్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మొత్తంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్ మాత్రం రసవత్తరంగా జరగనుంది.
Also Read: Anrich Nortje: అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణం ఏంటో తెలుసా?
Also Read: OnePlus new TV: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌టీవీ- ధర, ఫీచర్ల ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook