Ind vs SA 3rd ODI Prediction: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు వన్డేలు ముగిశాయి. చెరో మ్యాచ్ విజయంతో సమంగా ఉన్న సిరీస్ దక్కించుకోవాలంటే మూడవ మ్యాచ్ గెలవకతప్పని పరిస్థితి. మొదటి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇండియా రెండో వన్డేలో తడబడింది. మూడో వన్డే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సఫారీ గడ్డపై ఆ దేశంతో జరిగిన టీ20 సిరీస్ సమమైంది. ఇప్పుుడు మూడు వన్డేల సిరీస్ 1-1తో ఉండగా చివరి వన్డే ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమ్ ఇండియాలో సాయి సుదర్శన్ మొదటి రెండు మ్యాచ్‌లలో రాణించాడు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ ఆకట్టుకోలేకపోయారు. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ అదరగొట్టారు. ఇవాళ జరిగే మూడో మ్యాచ్‌లో తిలక్ వర్మ స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చే అవకాశముంది. అటు దక్షిణాఫ్రికా తరపున టోని జోర్జి సెంచరీతో ఫామ్‌లో ఉంటే మార్క్ రమ్, రీజా హెన్‌డ్రిక్స్, క్లాసెన్, డసెన్, మిల్లర్ రాణిస్తే ప్రోటీస్ జట్టుకు తిరుగుండదు.
పిచ్ రిపోర్ట్
ఇవాళ మూడో మ్యాచ్ జరగనున్న బోలండ్ పార్క్ పిచ్‌లో ఇప్పటి వరకూ జరిగిన 10 మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు అత్యధిక స్కోరు 254 పరుగులు. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ దిగవచ్చు. ఇవాళ వాతావరణం 17 శాతం హ్యుమిడిటీతో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షసూచన లేదు.
టీమ్ ఇండియా జట్టు
కేఎల్ రాహుల్, రజత్ పాటిదార్, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సంజూ శామ్సన్, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, యజువేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా జట్టు
ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాండెర్ డెసెన్, రీజా హెన్‌డ్రిక్స్, టోనీ డీ జోర్జి, మిహ్లాలీ పోంగ్వానా, వియాన్ ముల్దర్, హెన్రిచ్ క్లాసెన్, కైల్ వెర్రీన్, బ్యూరన్ హెన్‌డ్రిక్స్, కేశవ్ మహారాజ్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గర్, తబ్రేజ్ షమ్సి
Also read: National Sports Award 2023: క్రీడా అవార్డులు ప్రకటన.. మహ్మద్ షమీకి అర్జున అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook