Albie Morkel hits longest six in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే మంచి ఎంటర్‌టైన్‌మెంట్. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ టీ20 బ్యాటర్లు పాల్గొనే ఈ మెగా లీగ్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. టీ20 అంటే బ్యాటర్ల హవా కాబట్టి.. కళ్లు చెదిరే పర్ఫార్మెన్సెస్ ఎన్నో చూస్తూనే ఉంటాం. భారీ స్కోర్ చేసే క్రమంలో కొందరు బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుంటారు. ఈ క్రమంలో బ్యాటర్లు కొట్టే భారీ సిక్స్‌లు (Biggest Sixes In IPL History) చూడటానికి రెండు కళ్లూ చాలవు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 115 మీటర్ల సిక్సర్‌తో ఐపీఎల్ 2023లో భారీ సిక్సర్ నమోదు చేశాడు.
ఆల్బీ మోర్కెల్:
ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్స్ (Highest Sixes In IPL History) బాదింది మాత్రం దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఆల్బీ మోర్కెల్. మోర్కెల్ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో 125 మీటర్ల సిక్స్‌ను బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద సిక్స్. ఎడమచేతి వాటం బ్యాటర్ మోర్కెల్.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ డెక్కన్ ఛార్జర్స్‌పై 125 మీటర్ల సిక్సర్ కొట్టాడు. ఇప్పటివరకు మోర్కెల్ రికార్డుకు చేరువలో ఎవరూ రాలేదు. సిక్సుల కింగ్స్ రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ, క్రిస్ గేల్ లాంటి వారికి కూడా సాధ్యం కాలేదు.
ప్రవీణ్ కుమార్:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) ఆల్ రౌండర్ ప్రవీణ్ కుమార్ 124 మీటర్ల సిక్సర్‌ని కొట్టాడు. 2011లో రాజస్థాన్ రాయల్స్‌పై ప్రవీణ్ 124 మీటర్ల సిక్సర్ బాదాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్:
ఐపీఎల్ చరిత్రలో మూడో పొడవైన సిక్సర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరుపై ఉంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గిల్‌క్రిస్ట్.. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 122 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.
రాబిన్ ఉతప్ప:
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్ టోర్నీలో నాలుగో పొడవైన సిక్సర్ కొట్టాడు. 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ ఉతప్ప 120 మీటర్ల సిక్సర్ బాదాడు.
క్రిస్ గేల్:
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన విండీస్ దిగ్గజం క్రిస్ గేల్.. భారీ సిక్స్‌ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 2013లో సహారా పూణె వారియర్స్‌పై గేల్ 119 మీటర్ల సిక్స్ కొట్టాడు.
Also Read: Kendra Lust-Rinku Singh: రింకు సింగ్ ఆటకు ఫిదా అయిన హాట్ పోర్న్‌స్టార్.. ట్వీట్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.