CSK vs GT IPL 2023 Final: చెన్నై vs గుజరాత్ ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులపై ఓ లుక్కేయండి! ధోనీని ఊరిస్తున్న రికార్డ్స్

Here is Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Final Records. ఐపీఎల్ 2023 ఫైనల్లో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  

Written by - P Sampath Kumar | Last Updated : May 28, 2023, 03:10 PM IST
CSK vs GT IPL 2023 Final: చెన్నై vs గుజరాత్ ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులపై ఓ లుక్కేయండి! ధోనీని ఊరిస్తున్న రికార్డ్స్

Here is Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Final Records: ఐపీఎల్ 2023 ఫైనల్ సమరం మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ టాస్ రాత్రి 7 గంటలకు పడనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. ఈ సీజన్ ఆరంభంలో రెండు జట్లు అద్భుతమైన ఆటతీరు కనబరిచాయి. క్వాలిఫైయర్‌ 1లో గుజరాత్‌ను ఓడించిన చెన్నై నేరుగా ఫైనల్ చేరగా.. క్వాలిఫైయర్‌ 2లో ముంబైని చిత్తుచేసిన హార్దిక్ సేన ఫైనల్‌కు దూసుకొచ్చింది. 

వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను పట్టేయాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. మరోవైపు ఐదో కప్‌ను ఖాతాలో వేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. ఇరు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్న కారణంగా మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 ఫైనల్లో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చెన్నై సారథి ఎంఎస్ ధోనీని రెండు రికార్డ్స్ ఊరిస్తున్నాయి. 

# ఇప్పటికే 4 ఐపీఎల్ టైటిళ్లను సాధించిన చెన్నై ఐదోసారి విజేతగా నిలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో చెన్నై ప్లేయర్స్ గిఫ్ట్‌ ఇస్తారో లేదో వేచి చూడాలి. చెన్నై ఈసారి విజేతగా నిలిస్తే ముంబైతో సమంగా (5 టైటిల్స్) నిలుస్తుంది.  

# ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై టైటిల్‌ను గెలిస్తే ఐపీఎల్‌ చరిత్రలో మరో రికార్డు నమోదవుతుంది. ఎంఎస్ ధోనీ పేరిట అరుదైన ఘనత నమోదవుతుంది. అత్యధిక వయసులో (41 ఏళ్లు) ఐపీఎల్‌ టైటిల్‌ను నెగ్గిన జట్టు సారథిగా ధోనీ రికార్డు సృష్టిస్తాడు. 

# చెన్నై మాత్రమే వరుసగా రెండు ఐపీఎల్‌ కప్‌లను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ అవకాశం గుజరాత్ టైటాన్స్‌కు వచ్చింది. 2022లో అరంగేట్రం చేసిన గుజరాత్ తొలి టైటిల్‌ను గెలిచినా విషయం తెలిసిందే. 
 
# రుతురాజ్ గైక్వాడ్ మరో 36 పరుగులు చేస్తే ఈ సీజన్‌లో 600 రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. చెన్నై 2021 సీజన్ విజేతగా నిలిచినప్పుడు రుతురాజ్‌ ఆరు వందలకు పైగా (635) పరుగులు చేశాడు. 

# శుభ్‌మన్ గిల్ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. ప్రస్తుతం 851 పరుగులు చేశాడు. అయితే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాలంటే గిల్‌ ఇంకా 122 పరుగులు చేయాలి. విరాట్‌ కోహ్లీ (973)ను అత్యధిక రన్స్ చేస్తాడు.

Also Read: Manjusha Rampalli Hot Pics: పల్చటి చీరలో మంజూష.. నాభి అందాలతో రచ్చ చేస్తున్న హాట్ యాంకర్!

Also Read: Shubman Gill: చెన్నై ఐదో టైటిల్‌ కలకు అతడు అడ్డంకిగా మారతాడు.. భారత మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 
 

Trending News