DC vs CSK IPL 2023 Dream11 Prediction Today Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లీగ్ దశ ముగింపుకు చేరింది. రేపటి లోగా ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవో తేలనుంది. కొన్ని జట్లకు చివరి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌కు నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నైకి ఈ విజయం చాలా కీలకం. మరోవైపు ఢిల్లీకి ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు లేకపోయినా.. విజయంతో ఈ లీగ్ ముగించాలని చూస్తోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా 15 పాయింట్స్ ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ కారణంగా మూడో స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే.. ధోనీ సేన ఖాతాలో 17 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. భారీ విజయం సాధిస్తే రెండో స్థానం దక్కే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే క్వాలిఫయర్ మ్యాచ్‌లను ఆడొచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడితే మాత్రం లక్నో, ముంబై, బెంగళూరు జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
చెన్నై బ్యాటర్లు మరోసారి తమ విశ్వరూపం చూపిస్తే విజయం పెద్ద కష్టమేమి కాదు. ఓపెనర్లు డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ కనబర్చుతున్నారు. అజింక్య రహానే, శివమ్ దూబె ఫర్వాలేదనిపిస్తున్నారు. అంబటి రాయుడు సత్తాచాటాల్సిన అవసరం ఉంది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ బ్యాట్‌ను ఝుళిపిస్తే చెన్నైకి తిరుగుండదు. మరోవైపు ఢిల్లీ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్, పృథ్వీ షాతో కూడిన టాప్ ఆర్డర్ చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పవు. చెన్నై బౌలర్లు వీరిని అడ్డుకుంటేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. రన్ రేట్ కూడా మెరుగుపర్చుకోవచ్చు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఆర్ఆర్ రోసౌవ్, పృథ్వీ షా, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, అక్షర్ పటేల్, ఫిల్ సాల్ట్ (కీపర్), అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, అజింక్య రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.
డ్రీమ్11 టీమ్:
కీపర్ - డెవాన్ కాన్వే, ఫిలిప్ సాల్ట్ (వైస్ కెప్టెన్)
బ్యాట్స్‌మెన్ - డేవిడ్ వార్నర్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు - రవీంద్ర జడేజా, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, మొయిన్ అలీ
బౌలర్లు - తుషార్ దేశ్‌పాండే, మహేశ్ పతిరానా.
Also Read: BRO Movie: ఆసక్తికరంగా పవన్ కల్యాణ్-సాయి తేజ్ మూవీ టైటిల్.. స్టైలిష్ లుక్‌లో పవర్‌స్టార్!
Also Read: Sea Lion Video Game: వీడియో గేమ్ ఆడిన సముద్ర సింహం.. నమ్మకుంటే ఈ వీడియో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.