CSK vs KKR Highlights, IPL 2023: కోల్‌కతా తన అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. కేకేఆర్ బ్యాటర్లలో రింకూ సింగ్, నితీష్ రాణా హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
శివమ్ ఒక్కడే..
చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆరంభం ఘనంగానే ఉన్నా అది చివరి వరకు కొనసాగించలేకపోయింది. తొలి 5 ఓవర్లలో 48 పరుగులు చేసిన ధోని సేన.. ఆ తర్వాత తడబడింది. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. చెన్నై పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఆ జట్టును దెబ్బతీశాడు. శివమ్ దూబె (48 నాటౌట్), కాన్వే (30) జడేజా (20) రాణించకపోతే ఆ జట్టు ఆ స్కోరు కూడా చేసేది కాదు. నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు.
తడబడ్డా నిలిచింది..
అనంతరం ఛేజింగ్ ను ప్రారంభించిన కేకేఆర్ ఆదిలోనే తడబడింది. దీపక్ చాహర్ (3 వికెట్లు) ధాటికి ఆ జట్టు 5 ఓవర్లలో కేవలం 38 పరుగుల చేసి మూడు వికెట్లు కోల్పోయింది. అయితే రింకూ సింగ్ ( (54), నితీశ్ రాణా క్రీజులో నిలదొక్కుకుని పరుగులు రాబట్టడంతో కోల్‌కతా లక్ష్యంగా దిశగా దూసుకెళ్లింది. వీరిద్దరు అర్ధ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. చివరిలో రింకూ ఔటైనా.. రసెల్ తో కలిసి మిగతా పనిని రాణా ((57 నాటౌట్) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే ఉంటే చెన్నై నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరేది. అయినా సరే ధోని సేన రేసులో చాాలా ముందుంది.
Also Read: RR vs RCB: 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్.. 112 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.