Nicholas Pooran Smashed Fastest Half Century in IPL 2023: ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సోమవారం చిన్నసామి స్టేడియంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరుపై లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. లక్నో విజయంలో విండీస్ వీరుడు నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు.19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులతో 62 రన్స్ చేశాడు. భారీ సిక్సులతో చెలరేగుతూ బెంగళూరు చేతిలో ఉన్న మ్యాచును లక్నో వైపు తిప్పాడు. పూరన్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా సొంత మైదానంలో ఫాఫ్ సేనకు నిరాశే ఎదురైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (79 నాటౌట్; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59; 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. ఆరంభంలో తడబడినా చివరికి గట్టెక్కింది. బెంగళూరు కీపర్ దినేష్ కార్తీక్ తప్పిదం కారణంగా లక్నో విజయం సాధించింది.
భారీ లక్ష్య ఛేదనలో లక్నో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మార్కస్ స్టోయినిస్ (65; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నాడు. స్టోయినిస్ ఔటయ్యక లక్నో ఓటమి ఖాయం అని అనుకున్నారు. అయితే క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లక్నో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 19 బంతుల్లో 62 పరుగులు చేశాడు. లక్నోను రేసులోకి తెచ్చి పూరన్ ఔటయ్యాడు. మిగతా పనిని బౌలర్లు పూర్తి చేశారు.
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ (IPL 2023 Fastest Fifty) చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా (IPL Fastest Fifty) రికార్డు నెలకొల్పాడు. యూసప్ పఠాన్, సునీల్ నరైన్‌తో కలిసి పూరన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కేల్ రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే అర్ధ శతకం బాదారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి