LSG vs RCB IPL 2023 43rd Match Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మరోకొద్ది సేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. లక్నోలోని వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గత మ్యాచ్‌లకు బెంగళూరుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవరించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీగా దూరంగా ఉన్న ఫాఫ్ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం డుప్లెసిస్ రెండు మార్పులు చేశాడు. జోష్ హేజిల్‌వుడ్, అనూజ్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక మార్పు చేశాడు. అవేశ్ ఖాన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ తుది జట్టులో ఆడనున్నాడు.
16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో తొలుత లక్నో గెలిచింది. ఆ మ్యాచులో బెంగళూరు 212 పరుగులు చేయగా.. లక్నో చివరి బంతి వరకు పోరాడి ఒక వికెట్ తేడాతో గెలిచింది. దాంతో ఈ మ్యాచ్‌లో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫాఫ్ సేన భావిస్తోంది. రెండు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
తుది జట్లు (RCB vs LSG Playing 11):
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మ్యక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.
🚨 Toss Update 🚨@RCBTweets win the toss and elect to bat first against @LucknowIPL.
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/6t6Bs18AH8
— IndianPremierLeague (@IPL) May 1, 2023
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
లక్నో: ఆయుష్ బదోని, డానియల్ సామ్స్, అవేశ్ ఖాన్, డికాక్, ప్రేరక్ మన్కడ్
బెంగళూరు: హర్షల్ పటేల్, షాబాబ్ అహ్మద్, విజయ్‌కుమార్ వైశాఖ్, బ్రాస్‌వెల్, సోను యాదవ్.
Also Read: Kedar Jadhav RCB: బెంగళూరుకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్! చెన్నై ప్లేయర్ ఇన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.