MI vs SRH Dream11 Prediction Team: ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే గెలవాల్సిందే.. హైదరాబాద్‌తో ముంబై బిగ్‌ ఫైట్.. డ్రీమ్‌ 11 టీమ్ ఇదే..!

Mumbai Indians Vs Sunrisers Hyderabad Dream11 Team Tips and Top Picks: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ కీలక పోరుకు రెడీ అయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ను భారీ తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని చూస్తోంది. టాప్‌-4లో ఇప్పటికే మూడు బెర్త్‌లు ఫిక్స్‌ అయిపోగా.. ఒక ప్లేస్‌ కోసం రాజస్థాన్, ముంబై, బెంగుళూరు జట్ల మధ్య పోటీ నెలకొంది. నేడు ప్లేఆఫ్స్‌కు చేరే జట్లు ఏవో తేలిపోనుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 21, 2023, 08:09 AM IST
MI vs SRH Dream11 Prediction Team: ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే గెలవాల్సిందే.. హైదరాబాద్‌తో ముంబై బిగ్‌ ఫైట్.. డ్రీమ్‌ 11 టీమ్ ఇదే..!

Mumbai Indians Vs Sunrisers Hyderabad Dream11 Team Tips and Top Picks: ఐపీఎల్‌ 2023 ప్లేఆఫ్స్‌లో ఒకే బెర్త్ మిగిలింది. ఆ బెర్త్ కోసం నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. రెండు జట్లు ఈ సీజన్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే.. ముంబైని టోర్నీ నుంచి ఇంటికి ముఖం పట్టించి.. విజయంతో గౌరవప్రదంగా టోర్నీ నుంచి తప్పుకుంటుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు నాలుగు విజయాలు, 8 పాయింట్లతో చివరిస్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటో హైదరాబాద్‌ను ముంబై భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం.. 

పిచ్ రిపోర్ట్ ఇలా..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ జరుగుతుండడంతో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన 108 మ్యాచ్‌ల్లో జట్టు 50 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. 58 సార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు గెలుపొందింది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170 పరుగులుగా ఉంది. అంటే టాస్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో హైస్కోరింగ్‌ గేమ్‌గా చూడొచ్చు. 

హెడ్ ​​టు హెడ్ రికార్డు ఇలా..

ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 11 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ముంబై ఓడించింది. ఈసారి సొంత మైదానంలో ముంబైదే పైచేయిగా కనిపిస్తోంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ కావడంతో ముంబై భారీ యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగే అవకాశం ఉంది. 

ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మాధవల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి.

డ్రీమ్ 11 టీమ్ టిప్స్..

వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి
ఆల్‌రౌండర్లు: కామెరూన్ గ్రీన్, ఐడెన్ మార్క్‌రమ్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు: పీయూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, జాసన్ బెహ్రెండార్ఫ్, టి.నటరాజన్

Also Read: RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?

Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News