ప్రపంచకప్‌లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.లీగ్ దశలో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ కు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధావన్వన్‌కు చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతను మ్యాచ్ లో ఫిల్డింగ్ కు దిగలేని పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్ అనంతరం థావన్ చేతికి స్కాన్ తీసిన వైద్యులు..మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తేల్చేశారు. మంచి ఫాంలో ఉన్న థావన్ గాయాలపాలవడం టీమిండియాకు కాస్తంత చేధువార్తే మరి.
సెమీస్ నుంచి అందుబాటులో ఉండే ఛాన్స్
మూడు వారాల తర్వాత ధావన్ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. పిటిషన్ పరీక్షలో నెగ్గేతే తదుపరి మ్యాచ్ లు ఆడే అవకాశముంటుంది. లేదంటే వరల్డ్ కప్ టోర్నీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూడు వాతావారాల తర్వాత ధావన్ ఒక వేళ ఫిటినెస్ నిరూపించుకన్నపటికీ అప్పటికీ ( శ్రీలంకతో మ్యాచ్ మినహా ) లీగ్ దశ పూర్తవుతుంది. భారత్ సెమీస్ కు చేరుకునే సరికిగా థావన్ అందుబాటులో ఉంటాడన్న మాట. ప్రస్తుత ఫామ్ ను బట్టి టీమిండియా సెమీస్ కు చేరుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే కీలకమైన మ్యాచ్ లో థావన్ అందుబాటులోకి మళ్లీ వస్తాడన్న మాట
ధావన్ స్థానంలో ఎవరికి ఛాన్స్
గాయం కారణంగా శిఖర్ ధావన్ కు మూడు వారాల విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో ఎవరు భర్తీ చేస్తారనే తేలాల్సి ఉంది. ఇప్పటికీ అంబటి రాయుడి, రిషబ్ పంత్ స్టాండ్ బై ప్లయర్స్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు థావన్ స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతుంది. ధావన్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్స్ అయిన అంబటి రాయుడికి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వికెట్ కీపర్ గా ధోనీ ఉండగా అతని ఆల్టర్ నేట్ గా ధినేష్ కార్తీక్ ఉన్నాడు. ఇప్పుడు పంత్ వస్తే వికెట్ కీపర్ల సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ కారణం చేత రిషబ్ పంత్ కు ఛాన్స్ తక్కువే. అయితే ఇటివలి కాలంలో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన పంత్ కు తీసుకునే అవకాశాలను కొట్టే పారేయలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.