Justin Langer resigns as Australia Head Coach: ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పలు కారణాల కారణంగా ఆస్ట్రేలియా హెడ్ కోచ్ పదవికి అతడు రాజీనామా చేయక తప్పలేదు. ఈ విషయాన్ని లాంగర్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం ప్రకటించింది. గతేడాది ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్ 2021 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇంగ్లండ్‌ను యాషెస్ సిరీస్‌లో 4-0తో ఓడించిన తర్వాత కూడా లాంగర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హెడ్ కోచ్‌గా కొనసాగిచకపోవడం విశేషం.
'మా క్లైంట్ జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు సభ్యులు శుక్రవారం రాత్రి వరకు లాంగర్ భవిష్యత్తు గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే కొత్త ఒప్పందంపై వారు సముఖంగా లేరు. అందుకే లాంగర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు' అని లాంగర్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ ఓ ప్రకటనలో పేర్కొంది.
నిజానికి ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం జస్టిన్ లాంగర్ 2022 జూన్ వరకు తన పదవిలో కొనసాగాలి. అయితే సుదీర్ఘకాలం తన పదవీ కాలాన్ని పొడిగించాలని లాంగర్ కోరగా.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు అందుకు ఒప్పుకోలేదు. సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే, సీఏ నేషనల్ టీమ్స్ హెడ్ బెన్ ఒలివిర్‌తో ఈ విషయం గురించి చర్చించగా.. సానుకూల ఫలితం రాలేదు. దీంతో లాంగర్ రాజీనామా చేశారు. మరోవైపు జట్టులోని కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు అభిప్రాయ భేదాలు ఉండడం కూడా అతనికి ప్రతికూలతగా మారింది.
జస్టిన్ లాంగర్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు భారీ విజయాలు సాధించింది. అతడి పర్యవేక్షణలోనే ఆసీస్ తొలిసారిగా టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించింది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ సిరీస్‌లోనూ 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. టెస్టుల్లో అగ్రస్థానానికి కూడా చేరుకుంది. కోచ్‌గా అతని పదవీకాలం ఎలా ముగిసినప్పటికీ.. బ్యాట్‌తో లాంగర్ విన్యాసాలు ఇప్పటికే ఆస్ట్రేలియన్ క్రికెట్ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించాయి. 1993 నుండి 2007 వరకు 105 టెస్టులు ఆడిన లాంగర్ 45.27 సగటుతో 7696 పరుగులు చేశారు. షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, గ్లెన్ మెక్‌గ్రాత్ మరియు రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో కలిసి లాంగర్ ఆస్ట్రేలియన్ క్రికెట్‌ను ఉన్నత స్థానాలకు చేర్చారు.
Also Read: Medaram Jatara : మేడారం జాతర కోసం TSRTC ప్రత్యేక యాప్
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook