PBKS vs RR: ఐపీఎల్ 2021(IPL-2021) సెకాండాఫ్ ను రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయంతో ఆరంభించింది. మంగళవారం 2 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్( rajastan royals)నే విజయం వరించింది. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కార్తీక్ తాగి..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
చివరి ఓవర్ సాగిందిలా...
పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 4 పరుగులు కావల్సి ఉంది. ఫైనల్ ఓవర్‌ని వేసేందుకు కార్తీక్ త్యాగి(Kartik Tyagi)రంగంలోకి దిగాడు. తొలి బంతికి మక్రాం పరుగులేమీ సాధించలేదు. రెండో బంతికి మక్రాం సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. పంజాబ్ చేతిలో ఉన్న మ్యాచ్ కాస్త.. రాజస్థాన్ చేతిలోకి పోయింది. ఇంకో మూడు బంతులు మిగిలి ఉండగా.. పంజాబ్ విజయానికి మూడు పరుగులు కావల్సి ఉంది. నాలుగో బంతికి హుడా పరుగులేమి సాధించలేదు. ఇక ఐదో బంతికి మరో వికెట్ పడగొట్టిన కార్తీక్ రాజస్థాన్‌కు థ్రిల్లింగ్ విక్టరీకి చేరువచేశాడు. ఆరో బంతికి కూడా పరుగులేమీ రాకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. రాజస్థాన్ విజయానికి క్రెడిట్ అంతా చివరి ఓవర్ సంధించిన కార్తీక్ త్యాగికే వర్తిస్తుంది.
What a FINAL over this has been 😳😳
RAJASTHAN ROYALS HAVE WON IT!#VIVOIPL #PBKSvRR pic.twitter.com/rYJTgOBsBR
— IndianPremierLeague (@IPL) September 21, 2021
Also Read: IPL 2021: అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
పంజాబ్ కింగ్స్(Punjab Kings) టీంలో ఓపెనర్లు రాహుల్(Rahul) (49), మయాంక్ అగర్వాల్ (67) సెంచరీ భాగస్వామ్యం చేసి మ్యాచ్‌ను మంచి స్థితిలో ఉంచారు. మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ ఇద్దరూ వెంటవెంటనే పెవలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మక్రాం(26), పూరన్(32) అర్థ సెంచరీ భాగస్వామ్యంతో విజయం వరకు తీసుకొచ్చినా చివరి ఓవర్‌లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓడిపోయారు. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి 2 వికెట్లు, సకారియా, తివాటియా తలో వికెట్ పడగొట్టారు.
మెుదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులలకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో పంజాబ్ టీం ముందు 186 పరుగుల లక్ష్యం ఉంది. జైస్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మహిపాల్ 43 పరుగులతో రెండవ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహిపాల్ 252 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 17 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్లతో 43 పరుగులు బాదేశాడు. లూయిస్ 36(7ఫోర్లు, 1 సిక్స్), లివింగ్‌స్టోన్ 25 (2 ఫోర్లు, 1 సిక్స్)పరుగులతో రాణించారు. మిగతా వారు అంతగా రాణించలేదు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 5, షమీ 3, ఇషాన్ పొరెల్, హార్‌ప్రీత్ చెరో వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook