Kidambi Srikanth: ఫైనల్లో పోరాడి ఓడిన కిదాంబి శ్రీకాంత్...సిల్వర్ తో సరి..

Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్​ పురుషుల సింగిల్స్​​లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ రజతం సాధించాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 09:38 PM IST
  • కిదాంబి శ్రీకాంత్​కు రజతం
  • తొలి ఇండియన్ గా రికార్డు
  • కాంస్యం గెలుచుకున్న లక్ష్యసేన్
Kidambi Srikanth: ఫైనల్లో పోరాడి ఓడిన కిదాంబి శ్రీకాంత్...సిల్వర్ తో సరి..

BWF World Championships 2021 Final: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్​ పురుషుల సింగిల్స్​​లో కిదాంబి శ్రీకాంత్‌(Kidambi Srikanth) పోరాడి ఓడాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కియాన్ యో(సింగపూర్​) చేతిలో 15-21, 20-22 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో శ్రీకాంత్ రజతం(silve Medal) సాధించి చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్​లో సిల్వర్ సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
 

సెమీఫైనల్లో శ్రీకాంత్​ 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై విజయం సాధించి ఫైనల్​ చేరాడు. సెమీస్‌లో ఓడిపోయిన లక్ష్య సేన్‌(Lakshya Sen)కు కాంస్య పతకం లభించింది. డబ్ల్యూబీసీలో ఫైనల్‌కు చేరిన మూడో భారత షట్లర్‌గా శ్రీకాంత్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో గతంలో సైనా నెహ్వాల్ (2015), పీవీ సింధు (2017, 2018, 2019) ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

Also Read: Kidambi Srikanth: సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్‌.. సైనా, సింధు తర్వాత!!

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్​లో అకానె యమగూచి (జపాన్‌) స్వర్ణం సాధించింది. ఒకటో సీడ్​ తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై 21-14,21-11తో విజయం సాధించింది. దీంతో బీడబ్ల్యూఎఫ్​ ఛాంపియన్స్ టైటిల్​ని నెగ్గిన జపాన్​ రెండో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News