Prasidh Krishna Throw: రాజస్థాన్ బౌలర్‌ని కొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ.. మైదానంలో నవ్వులే నవ్వులు (వీడియో)

Prasidh Krishna throw hits Trent Boult. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఫీల్డర్ ప్రసిద్ధ్ కృష్ణ.. బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను బంతితో కొట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 05:33 PM IST
  • వికెట్‌కి బదులుగా.. బౌలర్‌ని కొట్టిన ప్రసిద్ధ్
  • మైదానంలో నవ్వులే నవ్వులు
  • నోటికి చెయ్యి అడ్డుపెట్టి నవ్వుకున్న బట్లర్
Prasidh Krishna Throw: రాజస్థాన్ బౌలర్‌ని కొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ.. మైదానంలో నవ్వులే నవ్వులు (వీడియో)

Rajasthan Royals fielder Prasidh Krishna throw hits bowler Trent Boult: క్రికెట్ ఆటలో నిత్యం ఫన్నీ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. బ్యాటర్, బౌలర్, ఫీల్డర్.. ఎవరో ఒకరి కారణంగా సరదా సంఘటనలు జరుగుతుంటాయి. అవి మైదానంలోని ఆటగాళ్లనే మాత్రమే కాకుండా.. అభిమానులను కూడా అలరిస్తాయి. అలాంటి సంఘటనే తాజాగా ఐపీఎల్ 2022లో జరిగింది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఫీల్డర్ ప్రసిద్ధ్ కృష్ణ.. బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను బంతితో కొట్టాడు. విషయంలోకి వెళితే... 

సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన లక్ష్య ఛేదన కోసం కోల్‌కతా నైట్‌ రైడర్స్ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. తొలి బంతిని ఎదుర్కొన్న ఓపెనర్ బాబా ఇంద్రజిత్.. మిడాన్ దిశగా షాట్ ఆడాడు. ఇంద్రజిత్ రన్ కోసం పరుగెత్తగా.. మిడాన్లో ఫీల్డింగ్ చేస్తోన్న ప్రసిద్ధ్ కృష్ణ.. బంతిని అందుకుని వేగంగా వికెట్ కీపర్ ఎండ్ వైపు విసిరాడు. అప్పటికి ఇంకా ఆరోన్ ఫించ్‌ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ వైపు చేరుకోలేదు. అయితే ప్రసిద్ధ్ విసిరిన త్రో.. ట్రెంట్ బౌల్ట్‌ కాలికి బలంగా తాకింది. 

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన త్రో దెబ్బకు ట్రెంట్ బౌల్ట్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడపోయాడు. దాంతో బౌల్ట్‌కు ఆ సమయంలో నవ్వాలో ఏడ్వాలో తెలియరాలేదు. అనంతరం లేచిన బౌల్ట్.. బౌలింగ్ వేసేందుకు సిద్దమయ్యాడు. ఈ ఫన్నీ ఘటన చుసిన రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకున్నాడు. షిమ్రోన్ హెట్మెయిర్ కూడా నవ్వులు పూయించాడు. మరోవైపు మైదానంలోని ఫాన్స్ కూడా కాసేపు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చుసిన అందరూ నవ్వుకుంటున్నారు. 

Also Read: Jayawardene Team: రోహిత్, కోహ్లీకి దక్కని చోటు.. భారత్ నుంచి ఒక్కడే! జయవర్ధనే డ్రీమ్ టీ20 టీమ్‌ టాప్ 5 ప్లేయర్స్ వీరే!

Also Read: Nazriya Nazim Pics: పండగ పూట.. భర్త కౌగిలిలో నజ్రియా నజీమ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News