మహేంద్ర సింగ్ ధోనీ ఫేవరెట్ బైక్స్ ఇవే

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మోటార్ బైక్స్ అంటే చాలా ఇష్టమనే సంగతి ఆయన అభిమానులు అందరికీ తెలిసిందే. 

Updated: Aug 10, 2018, 10:03 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ ఫేవరెట్ బైక్స్ ఇవే
Image: MS Dhoni/Instagram

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మోటార్ బైక్స్ అంటే చాలా ఇష్టమనే సంగతి ఆయన అభిమానులు అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ ఇటీవలే ఆయన భార్య సాక్షి పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. "ఇవి మహి ప్రేమించిన అత్యద్భుతమైన బైక్స్" అని ఆమె తెలిపారు. మీకో విషయం తెలుసా... ధోని తన ఇంటిలోనే స్వయంగా బైక్స్ మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ మ్యూజియంలో తాను గతంలో కొన్న పాతకాలం నాటి బైకులతో పాటు కొత్తగా మార్కెట్టులోకి వచ్చే ప్రతీ బైక్ కూడా ఉంటుందట.

తాజాగా ఆయన తనకు బాగా ఇష్టమైన బైకులుగా పేర్కొంటూ కవాసకీ నింజా హెచ్ 2 ఆర్ మోడల్‌తో పాటు టీవీఎస్ ఆర్టీఆర్ 300 ఎఫ్ ఎక్స్ బైకుల ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు. గతంలో ధోని హార్లీ డేవిడ్ సన్ బైకుతో పాటు టీవీఎస్ స్టార్ సిటీ బైకులకు సంబంధించిన యాడ్స్‌లో కూడా నటించారు. టీమిండియా క్రికెటర్లలో బైకులంటే విపరీతంగా ప్రేమించిన ఫస్ట్ అండ్ లాస్ట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మహేంద్ర సింగ్ ధోని మాత్రమే అని అంటున్నారు ఇప్పుడు ఆయన అభిమానులు.

మిస్టర్ కూల్‌గా పేరుగాంచిన ధోని ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన టాలెంట్స్‌ను కూడా ఆయన అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ధోని  చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని ఓ చిన్న సైకిల్ పై చేసిన స్టంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చాలా వెరైటీగా ఉన్న ఆ స్టంట్‌ను ఆయన వీలైతే ఇంట్లో ట్రై చేయమని కూడా తన అభిమానులతో అన్నారు. ధోని గతంలో స్కూబా డైవింగ్ లాంటి సాహసాలు కూడా చేశారు. 

 

 

Another pic from BFI

A post shared by M S Dhoni (@mahi7781) on