Ambati Rayudu: చెన్నై జట్టుకు షాక్.. ఆ టోర్నీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు..!

Ambati Rayudu-Major League Cricket 2023: చెన్నై జట్టుకు షాక్ తగిలింది. అదేంటి అంబటి రాయుడు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కదా అని అనుకుంటున్నారా..? అవును.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పినా చెన్నై యజమాన్యానికి చెందిన జట్టుతో ఆడేందుకు ఒకే చెప్పాడు. వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 8, 2023, 07:24 PM IST
Ambati Rayudu: చెన్నై జట్టుకు షాక్.. ఆ టోర్నీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు..!

Ambati Rayudu-Major League Cricket 2023: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మేజర్ లీగ్ క్రికెట్ 2023 నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ సీజన్‌ నుంచి వైదొలిగాడు. మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యానికి సంబంధించిన జట్టే. యూఎస్‌ఏ వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ జూలై 13వ నుంచి జూలై 30 వరకు జరగనుంది. ఈ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ యాజమాన్యాలు జట్లను కొనుగోలు చేశాయి. 

ఈ లీగ్‌లో టీమిండియా నుంచి రిటైర్మెంట్ అయిన ఆటగాళ్లు పాల్గొనే విషయంపై బీసీసీఐ ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. కొత్త నిబంధనలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాతే భారత మాజీ ఆటగాళ్లు విదేశీ లీగ్‌లో పాల్గొనాలా..? లేదా..? అనేది నిర్ణయం కానుంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. చెన్నై జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. 

ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడిన అంబటి.. 4348 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 100 పరుగులు నాటౌట్ రాయుడు అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ఈ సీజన్‌లో అంబటి రాయుడు పెద్దగా రాణించలేదు. 16 మ్యాచ్‌ల్లో 158 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్‌లో క్రీజ్‌లో ఉన్న కాసేపైనా మెరుపులు మెరిపించాడు. 

కాగా.. అంబటి రాయుడు త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి నుంచే గ్రౌండ్‌లెవల్లో ప్రిపరేషన్ సిద్దం చేసుకుంటున్నాడు. ఏపీలో అధికార వైఎస్సార్సీపీ నుంచి రాయుడు బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఎంపీగా పోటీ చేస్తాడా..? ఎమ్మెల్యేగా బరిలో ఉంటాడా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Happy Birthday Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్.. దాదా కెరీర్‌లో మర్చిపోలేని వివాదాలు  

Also Read: HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!  ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News