క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌..ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బంతులు!

క్రికెట్ గురించి తెలియని వారు ఉండరు.

Last Updated : Apr 21, 2018, 08:05 AM IST
క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌..ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బంతులు!

క్రికెట్ గురించి తెలియని వారు ఉండరు. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెస్టులు, వన్డేలు, టీ-20లు, టీ-10 ఫార్మాట్‌లతో క్రీడాభిమానులను అలరిస్తున్న క్రికెట్.. ఇప్పుడు మరో కొత్త ఫార్మాట్‌కు సిద్దమైంది.

సంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌కు భిన్నంగా క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌ ప్రారంభమైనప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కు బీజం పడింది. ఆతరువాత టీ20 ఫార్మాట్‌ కూడా తోడవటంతో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెట్టింపు అయ్యింది. మూడు గంటల్లో మ్యాచ్‌ ముగియడం, బోర్ కొట్టించే డిఫెన్స్ వంటివి ఉండకపోవడంతో ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు క్రికెట్‌ అభిమానులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఇప్పుడు మరో కొత్త ఫార్మాట్ ముందుకొస్తోంది.

ఎనిమిది మంది ఆటగాళ్లతో ఓ జట్టును ఏర్పాటు చేసి, ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బంతులతో క్రికెట్ ఆడేలా కొత్త ఫార్మట్‌కు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ ఫార్మాట్‌లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు, 10 బంతులతో కూడిన ఓ ఓవర్‌ (మొత్తం 100 బంతులు) ఉంటాయని బోర్డు తెలిపింది. ప్రస్తుత ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో 20 బంతులు తక్కువగా వేస్తారు. 2020 నుంచి ఈ కొత్త ఫార్మాట్‌‌ను ప్రారంభించేందుకు ఈసీబీ ప్రయత్నాలు చేస్తోంది.

Trending News