టీమిండియా దూకుడుకు బ్రేకులు వేసిన న్యూజీలాండ్

టీమిండియా దూకుడుకు బ్రేకులు వేసిన న్యూజీలాండ్

Updated: Feb 10, 2019, 06:45 PM IST
టీమిండియా దూకుడుకు బ్రేకులు వేసిన న్యూజీలాండ్
Image credit:Twitter/@BlackCaps

హామిల్టన్ : ఆస్ట్రేలియాలో ఆసిస్ జట్టుపై రెండు సిరీస్‌లు గెల్చుకుని, అదే విజయ గర్వంతో న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ కూడా వన్డే సిరీస్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ పరంపరతో ముందుకు సాగుతున్న టీమిండియా దూకుడుకు బ్రేకులు వేస్తూ న్యూజిలాండ్‌ జట్టు.. నేడు జరిగిన చివరి టీ20లో భారత్‌‌ని ఓడించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇదివరకే చెరో మ్యాచ్ గెలుచుకోగా 1-1తో సరిసమానంగా నిలిచిన ఇరుజట్లు నేడు ఈడెన్ పార్క్ వేదికగా చివరి మ్యాచ్‌లో తలపడగా.. ఈ ఆటలో చివరి వరకు పోరాడిన టీమిండియా ఆఖర్లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి చివరకు 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య జట్టు న్యూజీలాండ్ 2-1 తేడాతో ఈ టీ20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది.