Viral Video: బౌండరీ లైన్‌ వద్ద పరుగెత్తుతూ.. డైవ్ చేసి సింగ్‌ల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ పట్టిన విల్ యంగ్!!

Will Young takes Marco Jansen Catch: కివీస్ ఆటగాడు విల్‌ యంగ్‌ సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. యంగ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు మార్కో జాన్సెన్‌ ఆశ్చర్యపోయాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 02:32 PM IST
  • ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రీలంక ప్లేయర్
  • డైవ్ చేసి సింగ్‌ల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ పట్టిన విల్ యంగ్
  • సోషల్‌ మీడియాలో వైరల్‌
Viral Video: బౌండరీ లైన్‌ వద్ద పరుగెత్తుతూ.. డైవ్ చేసి సింగ్‌ల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ పట్టిన విల్ యంగ్!!

Will Young takes stunning one-handed Catch To Dismiss Marco Jansen: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్ పెవిలియన్‌ బాట పడుతుంటాడు. ఎక్కువ శాతం ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతోనే బ్యాటర్ ఆశ్చర్యకరంగా ఔట్ అవుతుంటారు. ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. తాజాగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఓ అద్భుత క్యాచ్ నమోదైంది. కివీస్ ఆటగాడు విల్‌ యంగ్‌ సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఆటగాడు విల్‌ యంగ్‌ సూపర్ క్యాచ్‌ పట్టాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 79 ఓవర్‌ను  కొలిన్ గ్రాండ్‌హామ్‌ బౌలింగ్‌ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతికి ప్రొటీస్ పేసర్ మార్కో జాన్సెన్‌ మిడ్‌ వికెట్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి వెళ్తున్న వేగాన్ని బట్టి బౌండరీ వెళ్లడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న యంగ్‌.. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా డైవ్ చేసి సింగ్‌ల్‌ హ్యండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో జాన్సెన్‌ ఔట్ అయ్యాడు. 

విల్‌ యంగ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు మార్కో జాన్సెన్‌తో పాటుగా కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. 'ఓ వాట్ ఏ క్యాచ్' అంటూ వ్యాఖ్యాతలు పెద్దగా అరిచారు. యంగ్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫాన్స్.. 'స్టన్నింగ్‌ క్యాచ్'‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్', టేక్ ఏ బో' అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి. 

ఈ మ్యాచులో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్  227 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో డివాన్‌ కాన్వే (92), టామ్‌  బ్లాండల్‌ (44) టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. రబాడ, జాన్సెన్‌, మహారాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. 

Also Read: Rashmika Vijay Marriage: విజయ్‌ దేవరకొండతో పెళ్లి.. రష్మిక మందన్న ఏమన్నారంటే?

Also Read: Model Offer: ఉక్రెయిన్‌తో యుద్ధం చేయని వారితో పడుకోవడానికి సిద్ధం.. రష్యా సైనికులకు మోడల్ బంపర్ ఆఫర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News