Mumbai Cheating Case: భర్తను కంట్రోల్ చేసేందుకు జ్యోతిష్యుడికి రూ.59 లక్షలు ఇచ్చిన భార్య.. విచారిస్తే అందరూ అవాక్కు..!

Astrologer Dupe Woman: భర్తను కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలని ఆమె ఆలోచించింది. ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చూసి జ్యోతిష్యుడిని సంప్రదించింది. బ్లాక్ మ్యాజిక్ చేసి భర్తను చెప్పిన మాట వినే విధంగా చేస్తామని చెప్పి నిండా ముంచారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 03:08 PM IST
Mumbai Cheating Case: భర్తను కంట్రోల్ చేసేందుకు జ్యోతిష్యుడికి రూ.59 లక్షలు ఇచ్చిన భార్య.. విచారిస్తే అందరూ అవాక్కు..!

Astrologer Dupe Woman: సాంకేతిక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మన దేశంలో ఇంకా మూఢనమ్మకాలు ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. వ్యాపారవేత్త అయిన తన భర్తను కంట్రోల్ చేసేందుకు ఓ మహిళ ఏకంగా రూ.59 లక్షలు పోగొట్టుకుంది. బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఓ జ్యోతిష్యుడు, ఆమె మాజీ ప్రియుడు నిండా ముంచారు. ముంబై చోటు చేసుకున్న ఈ సంఘటన చోటు చేసుకుంది.

ముంబైకు చెందిన 39 ఏళ్ల వ్యాపారి ఇటీవల దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు రూ.35 లక్షల నగదు తీసుకువచ్చి క‌బోర్డ్‌ ఉంచాడు. అయితే ఇంట్లో నగదు హఠాత్తుగా మాయమైంది. ఈ విషయమైన భార్యను అడిగినా ఆమె తనకేమి తెలియదని చెప్పింది. అతను తన సోదరుడితో కలిసి భార్యను నమ్మించి అడగగా.. అసలు విషయం చెప్పింది. సోషల్ మీడియాలో ఓ జ్యోతిష్కుడిని కలిశానని.. చేత బడి చేయడానికి డబ్బులు తీసుకున్నాడని తెలిపింది. బంగారు ఆభరణాలు కూడా ఇచ్చానని భార్య చెప్పింది. 

సోదరుడు, కుటుంబ సభ్యులు చెప్పే మాటలు విని భర్త తనను వేధిస్తుండంతో.. భర్తను ఎలా కంట్రోల్ చేయాలని ఆ మహిళ ఆలోచిస్తుండేది. ఈ క్రమంలో బాదల్ శర్మ అనే జ్యోతిష్యుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన ప్రకటనను చూసి సంప్రదించింది. ఆమె భర్తకు చేత బడి చేసి నియంత్రణలోకి తీసుకువస్తానని అన్నాడు. ఇందుకు ఆమె మాజీ ప్రియుడు పరేష్ గదా కూడా సహకరిస్తానని చెప్పాడు.

అయితే బాదల్ శర్మ, పరేష్ గదా వ్యాపారవేత్త ఇంట్లో ఉన్న డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశారు. బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఆమె ఇంటి తనిఖీ చేస్తామంటూ వచ్చి రూ.35 లక్షలు తీసుకువెళ్లారు. అంతేకాదు రూ.24 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కూడా ఇచ్చేసింది. రూ.35 లక్షలు మాయమైనట్లు వ్యాపారి గుర్తించడంతో మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా మహిళ వద్ద డబ్బులు తీసుకున్న బాదల్ శర్మ, పరేష్ గదాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోవై పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: Viral Video: మొసలిని మింగిన కొండచిలువ.. ఎలా బయటకు తీశారో చూడండి.. గూస్‌బంప్స్ పక్కా..!
Also Read: Chicago Marriage Video: ఫ్రెండ్ పెళ్లికి చీర కట్టుకుని వచ్చిన అబ్బాయిలు.. పెళ్లికూతురు రియాక్షన్ అదుర్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News