Rahul Tewatia: ఎంఎస్ ధోనీ త‌ర్వాత.. ఆ రికార్డు రాహుల్ తెవాటియాదే!

Tewatia Smashes two sixes in last 2 balls. ఐపీఎల్‌లో చివ‌రి రెండు బంతుల‌ను సిక్సులు కొట్టి జ‌ట్టును గెలిపించిన రెండో ఆట‌గాడిగా రాహుల్ తెవాతియా రికార్డుల్లో నిలిచాడు. తెవాటియా కంటే ముందు ఎంఎస్ ధోనీ ఈ రికార్డు సృష్టించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 04:49 PM IST
  • తెవాతియా విశ్వరూపం
  • ఆఖరి రెండు బంతుల్లో భారీ సిక్సులు
  • ధోనీ త‌ర్వాత ఆ రికార్డు తెవాటియాదే
Rahul Tewatia: ఎంఎస్ ధోనీ త‌ర్వాత.. ఆ రికార్డు రాహుల్ తెవాటియాదే!

Rahul Tewatia becomes second player to Smashes 2 sixes in Last Two Balls after MS Dhoni: ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఇక పంజాబ్‌దే అని ఫిక్స్ అయిన ప్రతిఒక్కరి అంచనాలను రాహుల్ తెవాటియా తలక్రిందులు చేశాడు. ఆఖరి రెండు బంతుల్లో భారీ సిక్సుల సాయంతో 12 పరుగులు చేసి గుజరాత్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. దాంతో తెవాటియా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

గుజ‌రాత్ టైటాన్స్‌ విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు కావాలి. డేవిడ్‌ మిల్లర్‌ (1), హార్దిక్‌ పాండ్యా (27) క్రీజులో ఉండగా.. ఒడియన్‌ స్మిత్‌ బంతిని అందుకున్నాడు. తొలి బంతిని స్మిత్‌ వైడ్‌ వేయగా.. ఆ తర్వాత బంతికి హార్దిక్ రనౌటయ్యాడు. దీంతో రాహుల్ తెవాతియా క్రీజులోకి వచ్చి రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతిని మిల్లర్‌ బౌండరీకి తరలించడంతో.. గుజ‌రాత్ విజయ సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులుగా మారింది. ఇక నాలుగో బంతికి మిల్లర్‌ మరో సింగిల్‌ తీయడంతో గుజరాత్‌ ఆశలు వదులుకుంది. ఇక్కడే తెవాతియా తనలోని విశ్వరూపం ప్రదర్శించాడు. 

ఒడియన్‌ స్మిత్‌ వేసిన ఐదవ బంతిని రాహుల్ తెవాతియా లెగ్ సైడ్ బి భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద ఫీల్డర్ అందుకునే ప్రయత్నం చేసినా.. సిక్స్ వెళ్లింది. దాంతో సమీకరణం ఒక బంతికి ఆరు పరుగులుగా మారింది. ఆఫ్ సైడ్ జరిగిన తెవాతియా చివరి బంతిని కూడా లెగ్ సైడ్ సిక్సర్‌గా మలిచాడు. ఇంకేముంది గుజ‌రాత్ టైటాన్స్‌ విజయం సాధించి.. టోర్నీలో హ్యాట్రిక్ కొట్టింది. మైదానంలోని గుజ‌రాత్ ఫాన్స్ అయితే రచ్చరచ్చ చేశారు. ఈలలు, కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. 

మెగా టోర్నీ ఐపీఎల్‌లో చివ‌రి రెండు బంతుల‌ను సిక్సులు కొట్టి జ‌ట్టును గెలిపించిన రెండో ఆట‌గాడిగా రాహుల్ తెవాతియా రికార్డుల్లో నిలిచాడు. తెవాటియా కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఈ రికార్డు సృష్టించాడు. 2016లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే సూపర్ జెయింట్స్ త‌ర‌ఫున ఆడిన మహీ.. అక్ష‌ర్ పటేల్ బౌలింగ్‌లో చివ‌రి రెండు బంతుల‌కు సిక్సులు బాదాడు.

Also Read: Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు

Also Read: Sikkim Govt vs Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పనిచేయని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓ ప్రత్యేక విభాగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News