IPL 2021: రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు షాక్..కెప్టెన్​ సంజూ శాంసన్​కు రూ.12 లక్షల జరిమానా

IPL 2021:  రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కెప్టెన్​ సంజూ శాంసన్​కు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం పంజాబ్​ కింగ్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో స్లోఓవర్​ రేటు కారణంగా అతడికి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్​ నిర్వాహకులు ప్రకటించారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 05:04 PM IST
  • రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు ఎదురుదెబ్బ
  • సంజూ శాంసన్​కు రూ.12 లక్షల జరిమానా
  • పంజాబ్ తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేటే కారణం
IPL 2021: రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు షాక్..కెప్టెన్​ సంజూ శాంసన్​కు రూ.12 లక్షల జరిమానా

Sanju Samson gets BIG fine from BCCI: పంజాబ్‌ కింగ్స్‌పై విజయంతో జోరు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌(Sanju Samson) కు 12 లక్షల జరిమానా విధించారు. కనీస ఓవర్‌రేటు మెయింటెన్‌ చేయని కారణంగా ఈ మేరకు ఫైన్‌ వేశారు. 

ఇందుకు సంబంధించి.. ‘‘వివో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్‌-2021లో పంజాబ్‌ కింగ్స్‌తో సెప్టెంబరు 21న దుబాయ్‌లోని దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు(Slow Over Rate in IPL 2021) కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌(rajasthan royals) జట్టు సంజూ శాంసన్‌కు జరిమానా విధించబడింది. ఈ సీజన్‌లో ఇదే వారి తొలి తప్పిదం. కాబట్టి శాంసన్‌కు 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాం’’ అని ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Also Read: IPL 2021: వావ్..వాట్ ఏ మ్యాచ్..చివరి బంతి వరకు ఉత్కంఠ..ఆఖర్లో రాజస్థాన్ అద్బుత విజయం

మళ్లీ రిపీట్ అయితే..
ఐపీఎల్‌ మార్గదర్శకాల(Slow Over Rate Rules in IPL) ప్రకారం, మొదటిసారి ఓవర్‌ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, అదే తప్పు పునరావృతం చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. ఇక మూడోసారి కూడా అదే జరిగితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారన్న సంగతి తెలిసిందే.
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్తాన్‌ 2 పరుగులతో తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో తమ తొలి గెలుపు నమోదు చేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News