రవిచంద్రన్ అశ్విన్‌కి జరిమానా తప్పదా ?

రవిచంద్రన్ అశ్విన్‌కి జరిమానా తప్పదా ?

Updated: Oct 25, 2019, 07:16 PM IST
రవిచంద్రన్ అశ్విన్‌కి జరిమానా తప్పదా ?

విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతూ బీసీసీఐ లోగో కలిగి ఉన్న హెల్మెట్‌ను ధరించినందుకుగాను తమిళనాడు జట్టు స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కి జరిమానా తప్పదా అంటే అవుననే తెలుస్తోంది. శుక్రవారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక-తమిళనాడు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ హెల్మెట్‌పై బీసీసీఐ లోగో కనిపించడంపై మ్యాచ్ రిఫరీ చిన్మయ్ శర్మ అతడితి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. మ్యాచ్‌లో పాల్గొనే ఆటగాళ్లు దుస్తులను ధరించే విషయంలో నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుందని.. లేని పక్షంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్య తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుందని అన్నారు. ఇక ఇదే ట్రోఫీలో పాల్గొన్న మయంక్ అగర్వాల్ తన హెల్మెట్‌పై ఉన్న బీసీసీఐ లోగోను టేప్‌తో కవర్ చేసుకుని జరిమానా రిస్క్ నుంచి తప్పించుకోగా.. కేఎల్ రాహుల్ సాధారణ హెల్మెట్ వినియోగించి వివాదానికే దూరంగా ఉన్నాడు.