పంత్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్న పాంటింగ్ !

వరల్డ్ కప్ లో భారత జట్టులో ఛాన్స్ లభించక నిరాశలో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీపాంటింగ్ బాసటగా నిలిచాడు

Updated: Apr 18, 2019, 10:49 AM IST
పంత్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్న పాంటింగ్ !

అద్భుత ఫాంలో ఉన్న రిషబ్ పంత్ భారత ప్రపంచకప్ జట్టులో లేకపోవడాన్ని మాజీ క్రికెటర్లకు ఆశ్చర్యానికి గురించి చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సునీల్ గవాస్కర్, గౌతం గంభీర్ సహా  పలువురు మాజీ క్రికెటర్లు పంత్ కు మద్దతుగా నిలిచారు. ఇదే అంశంపై విదేశీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. 

తాజాగా ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికిపాంటింగ్ స్పందిస్తూ సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులో రిషబ్ పేరు ఉంటుందని భావించానన్నాడు.  15 మంది సభ్యుల తుది జాబితాలో  పంత్ పేరు లేకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న పాంటింగ్  ఈ మేరకు స్పందించారు. హైదరాబాదీ అంబటి రాయుడి విషయంలోనూ ఇదేరకమైన అభిప్రాయాలు మాజీల నుంచి వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, అంబటి రాయుడుల పేర్లను స్టాండ్ బై గా ప్రకటించి సెలక్టర్లు చేతులు దులుపుకున్నారు.