India Vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్(India Vs South Africa)కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో అతడి ఎడమ చేతికి గాయం అయినట్లు బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి. రోహిత్ స్థానంలో గుజరాత్‌కి చెందిన యువ ఆటగాడు ప్రియాంక్ పాంచల్(Priyank Panchal) టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.
Also Read: IND Vs SA: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్.. కారణం అదేనా?!!
ఇటీవల దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగులతో రాణించాడు పాంచల్. ఇటీవలే ఆ దేశంలోనూ పర్యటించడం అతడికి కలిసివచ్చింది. దక్షిణాఫ్రికా(South Africa)తో డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్ తొలి టెస్టు ఆడనుంది. జనవరి 3-7 వరకు రెండో టెస్టు, 11-15 వరకు మూడో టెస్టు నిర్వహించనున్నారు. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు తలపడతాయి.
వన్డే సిరీస్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాగా టీ-20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి(Kohli) నుంచి టీ-20 కెప్టెన్సీని రోహిత్ స్వీకరించాడు. ఆ తర్వాత వన్డే పగ్గాలను కూడా అతనికే అప్పగించింది బీసీసీఐ. ఆతర్వాత దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో అజింక్యా రహానే స్థానంలో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించింది.
More details here - https://t.co/XXH3H8MXuM#TeamIndia #SAvIND https://t.co/jppnewzVpG
— BCCI (@BCCI) December 13, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook