తొలివన్డేలో భారత్ పై కివీస్ ఘన విజయం

న్యూజీలాండ్ పై టీ20 సిరీస్ గెలిచినా భారత్, తొలి వన్డేలో చితికిలఓడింది. వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. 

Last Updated : Feb 5, 2020, 06:45 PM IST
తొలివన్డేలో భారత్ పై కివీస్ ఘన విజయం

హోమిల్టన్: న్యూజీలాండ్ పై టీ20 సిరీస్ గెలిచినా భారత్, తొలి వన్డేలో చితికిలఓడింది. వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. దీంతో కివీస్, టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

రాస్ టేలర్(109) అజేయ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. నికోలస్(78), లాథమ్(69)లు అర్థసెంచరీలతో రాణించారు. అంతకుమందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్(103) సెంచరీతో మెరిశాడు. అయ్యర్ కెరీర్ లో తొలి వన్డే సెంచరీ ఇది. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ(51), కెఎల్ రాహుల్(88)లు అర్థ సెంచరీలతో రాణించారు. సెంచరీ సాధించిన రోస్ టేలర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News