RCB Last Day Dressing Room: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ ప్రస్థానం ముగిసింది. ఫైనల్ పోరుకు ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి అనంతరం..చివరిరోజు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది. ఆటగాళ్లు ఎలా గడిపారు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిజంగా అద్భుతమైన జట్టు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అద్భుతమైన లైనప్ కలిగి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. అయినా ఎందుకో అదృష్టం కలిసి రావడం లేదు గత రెండు సీజన్లలో ఎలిమినేటర్ గ్రహణం దాటని ఆర్సీబీ ఈసారి ఆ పరిస్థితి దాటింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని..క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో భంగపడింది. మరోసారి టైటిల్‌కు దూరమైంది.
రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు గడిపిన తీరు, ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఎలా ఉన్నారనే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్సీబి అధికారిక యూట్యూబ్‌లో ఈ వీడియో అప్లోడ్ అయింది.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా భారంగా..మౌనంగా..విషాద వదనాలతో ఉన్నారు. టీమ్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒక్కొక్కరికీ కలుసుకుంటూ హగ్ ఇచ్చారు. అటు విరాట్ కోహ్లి కూడా అందర్నీ కలుసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరి నుంచి వీడ్కోలు తీసుకున్నారు. జట్టులోని సిబ్బందికి, ఇతర ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్, టీషర్ట్స్‌పై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్..విరాట్ కోహ్లీని భుజంపై చేయి వేసి..మాట్లాడుకుంటూ వచ్చి..ఇతర ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.
ఆర్సీబీకు ప్రాతినిధ్యం వహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్వాలిఫయర్ 2 వరకూ జట్టును తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా నిరుత్సాహపడ్డామని..దినేష్ కార్తీక్ ఆవేదన చెందాడు. జట్టు ఆటగాళ్లంతా కష్టపడి ఆడారన్నాడు. తనపై, ఆర్సీబీపై అభిమానులు పెట్టుకున్న అంచనాల్ని వమ్ము చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. వచ్చే ఏడాది అభిమానుల ఆశల్ని నీరుగారనివ్వమన్నాడు.
మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ చివరిరోజు చాలా భారంగా..విషాద వదనాలతోనే గడిచింది. అయితే చివర్లో మాత్రం ఆటగాళ్లతో ఉత్సాహం నింపేందుకు ఆర్సీబీ ఆటగాళ్లంతా కోరస్‌తో కాస్సేపు సందడి చేసే ప్రయత్నం చేశారు.
Also read: RCB vs RR: ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం, ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్‌తో ఢీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook