Rajasthan Royals Vs Delhi Capitals: ఇద్దరు యంగ్‌స్టార్స్ మధ్య బిగ్ ఫైట్.. టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ 11 ఇదే..! 

RR Vs DC IPL 2024 Updates: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని ఢిల్లీ చూస్తుండగా.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని రాజస్థాన్ రెడీ అయింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 28, 2024, 07:47 PM IST
Rajasthan Royals Vs Delhi Capitals: ఇద్దరు యంగ్‌స్టార్స్ మధ్య బిగ్ ఫైట్.. టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ 11 ఇదే..! 

RR Vs DC IPL 2024 Updates: ఐపీఎల్ 2024లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. రోడ్డు యాక్సిడెంట్ తరువాత జట్టులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాడు. అటు తొలి మ్యాచ్‌లో లక్నోను చిత్తు చేసి రాజస్థాన్ రాయల్స్ జోరు మీదుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఢిల్లీ రెండు మార్పులు చేసింది. ఇషాంత్ శర్మ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. షైహోప్ వెన్నునొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీరిద్దరి స్థానంలో అన్రిచ్ నోకియా, ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతోంది.

Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగానే ఉంది. మేము దానిని ఉపయోగించాలనుకుంటున్నాము. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కొంత మంచు ఉండే అవకాశం ఉంది. ఒకే ఫ్రాంచైజీ తరుఫున 100 మ్యాచ్‌లు ఆడడం ఆనందంగా ఉంది. కానీ ప్రతి మ్యాచ్‌ నాకు ముఖ్యమైనది. జట్టులో రెండు మార్పులు చేశాం. ఇషాంత్ శర్మ ఇంకా కోలుకోలేదు. షైహోప్‌కు వెన్నునొప్పి ఉంది. అన్రిచ్ నోకియా, ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చారు.." అని ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. 

"టాస్ గెలిచి ఉంటే మేము మొదట బౌలింగ్ చేసే వాళ్లం. రెండో ఇన్నింగ్స్‌లో మంచు రావచ్చు. రెండు పిచ్‌లు పచ్చికతో సమానంగా ఉంటాయి. అయితే చివరి మ్యాచ్ మధ్యాహ్నం ఆడాం. టోర్నీలో మొత్తం 10 టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించకుంటే.. టోర్నీలో మరింత ముందుకు వెళతాం. అదే జట్టుతో ఆడుతున్నాం.." రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్.

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News