SA Vs AUS ICC Cricket World Cup 2023: రెండో సెమీస్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. కీలక పోరుకు తుది జట్లలో మార్పులు

South Africa Vs Australia 2nd Semi Final Updates: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీస్ పోరు మొదలైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కీలక పోరుకు రెండు జట్లు కూడా తుది జట్లలో మార్పులు చేశాయి. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 16, 2023, 02:53 PM IST
SA Vs AUS ICC Cricket World Cup 2023: రెండో సెమీస్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. కీలక పోరుకు తుది జట్లలో మార్పులు

South Africa Vs Australia 2nd Semi Final Updates: వరల్డ్ కప్‌ 2023లో రెండో సెమీ ఫైనల్ పోరుకు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు రెడీ అయ్యాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గ్రూప్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో చెరో 7 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. సౌతాఫ్రికా రెండు, ఆసీస్ మూడోస్థానంతో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిన ఆసీస్.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ఫైనల్‌లో భారత్ తలపడేందుకు రెడీ అవుతోంది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి తొలిసారి ఫైల్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని సఫారీలు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు రెండు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

"మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. టాస్ గెలవడం నేను నిజంగా కలలుగన్న విషయం కాదు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా లాంటి జట్టుతో తలపడుతున్నాం. ఆటపై మరింత దృష్టిపెట్టాలి. తుది జట్లలో రెండు మార్పులు చేశాం. ఎంగిడి స్థానంలో షమ్సీ, ఫెహ్లుక్‌వాయో స్థానంలో జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు.." అని సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా తెలిపాడు.

"మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. కానీ అది మేఘావృతమై ఉంది. ప్రారంభంలో కొంత స్వింగ్ ఉంది. ఇంతకు ముందు కూడా ఈ స్థానాల్లో ఉన్నాం. మాకు చాలా అనుభవం ఉంది. మొదటి రెండు మ్యాచ్‌లలో మేము మా అత్యుత్తమ ఆటతీరును కనబర్చలేదు. అయితే గత ఏడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడాం. తుది జట్టులో రెండు మార్పులు చేశౄం. స్టోయినిస్, అబాట్ స్థానంలో మాక్స్‌వెల్, స్టార్క్ తుది జట్టులోకి వచ్చారు." అని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడా, తబ్రైజ్ షమ్సీ

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్. 

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

Also Read: Viral News: ఆ గ్రామంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా ముస్తాబ్ చేసి ఊరేగిస్తారు..ఎందుకో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News