IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో దంచికొట్టిన శాంసన్..బంగ్లాపై టీమిండియా ప్రపంచ రికార్డ్ మిస్

IND vs BAN: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచులో భారత్ జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరును ఉంచింది. సంజూశాంసన్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు. సంజూ  47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి మొత్తం 111 పరుగులు  చేశాడు.  సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 75 పరుగులతో విజ్రుంభించాడు. కాగా 6 వికెట్లు కోల్పోయిన భారత నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది. 

Written by - Bhoomi | Last Updated : Oct 12, 2024, 09:19 PM IST
IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో దంచికొట్టిన శాంసన్..బంగ్లాపై టీమిండియా ప్రపంచ రికార్డ్ మిస్

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20లో అద్భుతం జరిగింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో  జరిగిన మూడో టీ20లో ఓపెనర్ సంజూ శాంసన్ బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేసి రికార్డు సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. తన తుఫాను ఇన్నింగ్స్‌లో, సంజు ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన గొప్ప ఫీట్ కూడా చేశాడు. అతను 10వ ఓవర్‌లో రిషద్ హుస్సేన్‌ను భీకరంగా చిత్తు చేశాడు. మొదటి బంతి తర్వాత 5 వరుస బంతుల్లో 5 సిక్సర్లు బాదాడు. 

అయితే ఆఖర్లో బ్యాట్స్ మెన్స్ తడబడటంతో టీ20ల్లో నేపాల్ పేరుతో ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కాస్త దూరంలో నిలించింది భారత్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్య కుమార్ యాదవ్ జట్టు బంగ్లా బౌలర్లపై చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 4 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. సూర్యకుమార్ , సంజూ శాంసన్ బంగ్లా ఆటగాళ్లను తిప్పి తిప్పి మూడుచెర్ల నీళ్లు తాగిపించారు. రిషద్ వేసిన 10వ ఓవరులో సంజూ ఏకంగా 30 పరుగులు చేశాడు. రెండో బంతి మినహా ఆ ఓవర్లో అన్ని బాల్స్ ను సిక్కర్ల బాట పట్టించడంతో బంగ్లా ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో సెంచరీ చేశాడు. సంజూ. ఆఖరిలో రియాన్ పరాగ్ 34, హార్థిక్ పాండ్యా 47  పరుగులు చేశారు. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. రింకూ సింగ్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 , టస్కిన్, మహ్మదుల్లా, ముస్తఫీజురో తలో వికెట్ తీశారు. 

 

టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లు

రోహిత్ శర్మ (35 బంతుల్లో)

సంజు శాంసన్ (40 బంతుల్లో)

సూర్యకుమార్ (45 బంతుల్లో)

అభిషేక్ శర్మ (46* బంతుల్లో)

కేఎల్ రాహుల్ (46 బంతుల్లో)

టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్లు

111 - సంజు శాంసన్ 

89 - ఇషాన్ కిషన్

65* - రిషబ్ పంత్

58 - ఇషాన్ కిషన్

58 - సంజు శాంసన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News