Sanju Samson: సంజూపై బీసీసీఐ పగబట్టిందా, మరోసారి ఇండియా జట్టుకు దూరం

Sanju Samson: ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రోళ్లతో జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్‌పై మరోసారి భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2023, 04:58 PM IST
Sanju Samson: సంజూపై బీసీసీఐ పగబట్టిందా, మరోసారి ఇండియా జట్టుకు దూరం

Sanju Samson: వన్డే ప్రపంచకప్ 2023 ముగిశాక మరో మెగా టోర్నీ 2024 టీ20 ప్రపంచకప్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టుపై అంతా మండిపడుతున్నారు. సీనియర్లకు విశ్రాంతినిచ్చ కుర్రోళ్లను ప్రకటించిన బీసీసీఐకు మరోసారి సంజూ శామ్సన్ కన్పించకపోవడం గమనార్హం. 

బీసీసీఐ ఎప్పటిలానే సంజూ శామ్సన్‌కు మరోసారి షాక్ ఇచ్చింది. ఆసియా కప్ 2023 టోర్నీకు సైతం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసి అంతలో రాహుల్ కోలుకోవడంతో ఇంటికి పంపించేశారు. ఆ తరువాత ఆసియా క్రీడలు 2023కు కూడా ఎంపిక కాలేదు. ప్రపంచకప్ 2023లో ఎలానూ చోటుదక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు లభిస్తుందని ఆశించినా నిరాశే ఎదురైంది. సంజూ శాంసన్ టీ20లో మంచి ప్లేయర్. చివరిగా ఆడిన టీ20 మ్యాచ్‌లో 26 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. సంజూ శామ్సన్‌కు ఐసీసీ టోర్నీలు ఆడే అవకాశం లేకుండా చేస్తోంది. 

ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌కు 31 ఏళ్ల జితేశ్ శర్మను ఎంపిక చేసిన టీమ్ ఇండియా సెలెక్టర్లు సంజూ శామ్సన్‌ను పక్కనపెట్టేశారు. సంజూతో పాటు యజువేంద్ర చాహర్, భుననేశ్వర్ కుమార్‌లకు కూడా స్థానం కల్పించలేదు. యజువేంద్ర చాహర్, సంజూ శామ్సన్‌పై బీసీసీఐ పగబట్టిందనే విమర్శలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఐసీసీ టోర్నీలు చేజారినా సెలెక్టర్లకు బుద్ది రాదని మండిపడుతున్నారు. సంజూ మా మాట విని రిటైర్ అయిపో..ఏ నెదర్లాండ్స్‌కో వెళ్లి 2027 ప్రపంచకప్ ఆ దేశం తరపున ఆడి బీసీసీఐకు బుద్ధి చెప్పు అంటూ అభిమానులు సూచిస్తున్నారు. 

Also read: Mohammad Siraj: త్వరలో పెళ్లి పీటలకెక్కనున్న మొహమ్మద్ సిరాజ్, పెళ్లి ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News