Qualifier 2 Ipl 2022: ఐపీఎల్‌ 2022 ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? శుక్రవారం ఆర్సీబీ రాజస్థాన్‌ మధ్య రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌..!

Qualifier 2 Ipl 2022: గుజరాత్‌ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రేపు ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టే ఫైనల్‌ లో గుజరాత్‌ ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో రెండో క్వాలిఫయర్‌  మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని రెండు జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 05:12 PM IST
  • శుక్రవారం రాజస్థాన్‌ ఆర్సీబీ మధ్య క్వాలిఫయర్‌ 2
  • ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో ఓటమిపాలై ఇంటిబాటపట్టిన లక్నో
  • తొలి క్వాలిఫయర్‌ లో నెగ్గి నేరుగా ఫైనల్‌ కు దూసుకెళ్లిన గుజరాత్‌
Qualifier 2 Ipl 2022: ఐపీఎల్‌ 2022 ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? శుక్రవారం ఆర్సీబీ రాజస్థాన్‌ మధ్య రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌..!

Qualifier 2 Ipl 2022: ఐపీఎల్‌ మ్యాచ్‌ లు తుదిదశకు చేరుకున్నాయి.   ఇంకా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నోపై ఆర్సీబీ విజయం సాధించింది. అటు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ నేరుగా ఫైనల్‌ కు దూసుకెళ్లింది. ఇక శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో రాజస్థాన్‌ ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టే ఫైనల్‌ లో గుజరాత్‌ ను ఢీకొట్టనుంది.

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నరకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. కేవలం రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌ లు మాత్రమే ఈ స్టేడియంలో జరగనున్నాయి. రాజస్థాన్‌ బెంగళూరు రెండు జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో గుజరాత్‌ చేతిలో రాజస్థాన్‌ ఓటమిపాలైంది. వికెట్లు తీసి గుజరాత్‌ను ఇరకాటంలో పెట్టడంలో రాజస్థాన్‌ బౌలర్లు విఫలమయ్యారు. బౌలింగ్‌ విభాగంలోట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, రవిచంద్రన్‌ అశ్విన్‌, చాహల్‌ లతో పటిష్టంగా ఉంది. ఇప్పటివరకు 15 మ్యాచ్‌ లు ఆడిన చాహల్‌  26 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. జోస్‌ బట్లర్‌ రాజస్థాన్‌ జట్టుకు పెద్ద అసెట్‌ అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఎందుకంటే బట్లర్‌ బ్యాటింగ్‌ గణాంకాలు చూస్తే మనకు తెలుస్తోంది. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌ 4 హాఫ్‌ సెంచరీలు, మూడు సెంచరీలు చేశాడు. మొత్తంగా 718 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచాడు. ఆ తర్వాత సంజూ శాంసన్‌, పదిక్కల్‌, హెట్‌మెయిర్‌, యశస్వి జైశ్వాల్‌ లతో బ్యాటింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ ఫుల్‌ స్ట్రాంగ్‌ గా ఉంది.

డుప్లెసిస్‌ నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ సీజన్‌ లో సరికొత్తగా కనిపిస్తోంది. ఆల్‌ రౌండ్‌ పర్ఫామెన్స్‌ తో అదరగొడుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌ లో లక్నోపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌ లో రజత్‌ పటిదార్‌ సెంచరీతో చెలరేగాడు. అతనికి దినేశ్‌ కార్తీక్‌ తోడుకావడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలర్లు విరుచుకపడటంతో లక్నో 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ రెండో క్వాలిఫయర్‌   మ్యాచ్‌ కు అర్హత సాధించింది.  హజిల్‌వుడ్‌, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, వాహిందు హసరంగాలతో కూడిన బెంగళూరు బౌలింగ్‌ విభాగం అత్యద్భుతంగా కనిపిస్తోంది. కోహ్లీ, డుప్లెసిస్‌ లలో ఒక్కరు స్టాండ్‌ అయినా ఆర్సీబీ ఈ మ్యాచ్‌ లో సునాయాసంగా విజయం సాధిస్తది.

ఇక ఐపీఎల్‌ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ ల్లో రాజస్థాన్‌.. 13 మ్యాచ్‌ లు బెంగళూరు గెలిచింది. మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.

Also Read: AP High court: మాజీ మంత్రి నారాయణకు ఊరట..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News