Rahul Dravid Hints Shreyas Iyer to play IND vs AUS 2nd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాగపూర్ వేదికగా మూడు రోజుల్లో ముగిసిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉంటే రెండో టెస్ట్ ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రెండో టెస్ట్ నేపథ్యంలో ఈరోజు రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. 'గాయపడిన ఆటగాళ్లు పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చారు. ఇది జట్టుకు లాభించనుంది. గాయాలతో ఆటగాళ్లను దూరం చేసుకోవాలనుకోవడం లేదు. శ్రేయస్ అయ్యర్ కోలుకుని జట్టులోకి రావడం మంచి విషయం. రెండు రోజుల ట్రైనింగ్ సెషన్ అనంతరం అతడిని ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. ఈ రోజు శ్రేయస్ లాంగ్ సెషన్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రేపు కూడా అతడిని పరిశీలిస్తాం. ఫిట్‌నెస్ సాధిస్తే జట్టులోకి తీసుకుంటాం' అని అన్నాడు.
'శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను బాగా ఎదుర్కోగలడు. అతని ఆట జట్టుకు ఎంతో అవసరం. ఆరంభం నుంచి శ్రేయస్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిషభ్ పంత్, ఆర్ జడేజాలతో కలిసి ఆదుకున్నాడు. శ్రేయస్ జట్టులోకి తిరిగిరావడం మంచి పరిణామం. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఎప్పుడో జట్టులో చోటు ఉంటుంది. గాయాలతో దూరమైనా వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం 'అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.
బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా సాధన చేశాడు. నెట్స్‌లో గంటలకొద్ది బ్యాటింగ్ చేశాడు. శ్రేయస్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. అనంతరం ఫుట్‌బాల్ కూడా ఆడాడు. శ్రేయస్ ప్రాక్టీస్, ఫిట్‌నెస్ చూస్తే రెండో టెస్ట్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ శ్రేయస్ జట్టులోకి వస్తే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక కీపర్ స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కొనసాగనున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.