SL vs AFG: క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే క్యాచ్ పట్టిన సమరవిక్రమ, వీడియో వైరల్

Sri Lanka vs Afghanistan: శ్రీలంక వికెట్ కీపర్ సమరవిక్రమ ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో జీవితాంతం గుర్తిండిపోయే క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 11:59 AM IST
SL vs AFG: క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే క్యాచ్ పట్టిన సమరవిక్రమ, వీడియో వైరల్

SL vs AFG Test Match:  చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ పట్టాడు శ్రీలంక వికెట్ కీపర్ సమరవిక్రమ. శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో అతిథ్య జట్టు వికెట్ కీపర్ సదీర విక్రమ నమ్యశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకుని క్రికెట్ లో తనకంటూ ఓ  పేజీ లిఖించుకున్నాడు. అతడి ముందు చూపుకు హట్సాఫ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

ఫిబ్రవరి 2 నుండి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల టెస్టు మ్యాచ్ మెుదలైంది. తొలి రోజు జయసూర్య  బౌలింగ్ లో అప్ఘానిస్తాన్ బ్యాటర్ రెహ్మత్ షా లైగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడాడు. ఆ షాట్ ఆడతాడని ముందుగానే గమనించిన సమరవిక్రమ లెగ్ స్లిప్ వెళ్తున్న బంతిని కళ్లు చెదిరే  రీతిలో క్యాచ్ పట్టాడు సమర విక్రమ. దీంతో బ్యాటర్ తో సహా అక్కడున్న వారందరూ షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: Watch: మ్యాచ్ మధ్యలో మైదానంలోకి అనుకోని అతిథి.. దానిని చూసి మ్యాచ్ ను ఆపేసిన అంపైర్లు, వీడియో వైరల్

సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో లంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్యల ధాటికి అప్ఘాన్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే కుప్పకూలింది. రెహ్మత్ షా ఒక్కడే 91 పరుగులతో సత్తా చాటాడు.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. చండిమాల్ మరియు ఏంజెలో మాథ్యూస్ శనివారం నాల్గవ వికెట్‌కు 232 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 212 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Also Read: IND vs ENG 2nd Test: బుమ్రా దెబ్బకు కుదేలైన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News