Watch: 'తిరువనంతపురం' అని పలకలేక ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు, ఫన్నీ వీడియో వైరల్

WC 2023: 'తిరువనంతపురం' అనే పేరు పలకలేక సౌతాఫ్రికా క్రికెటర్లు ఇబ్బందిపడిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పోస్ట్ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 12:00 PM IST
Watch: 'తిరువనంతపురం' అని పలకలేక ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు, ఫన్నీ వీడియో వైరల్

South Africa Cricket Team Funny video viral: మన దేశంలోని కొన్ని నగరాలు లేదా గ్రామాల పేర్లను ఇక్కడ పుట్టిన పెరిగిన వారే సరిగ్గా చెప్పలేరు. అలాంటిది సౌతాఫ్రికా నుంచి వచ్చిన క్రికెటర్లు చెప్పడమంటే పెద్ద టాస్కే. తిరువనంతపురం.. పేరు పలకడానికి ప్రోటీస్ ఆటగాళ్లు నానా తంటాలూ పడ్డారు. ఇద్దరు ముగ్గురు సరిగ్గా చెప్పగా.. మిగతా వారు నోటికి వచ్చినట్లు పలికారు. తాజాగా దీనికి సంబంధిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

తిరువనంతపురం అనే పేరు పలకలేక సౌతాఫ్రికా క్రికెటర్లు ఇబ్బంది పడుతున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. "సౌతాఫ్రికా జట్టు తిరువనంతపురం వచ్చింది. కానీ వాళ్లు ఎక్కడున్నారో ఎవరికైనా చెప్పగలరా?" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు శశి థరూర్. ఇందులో తిరువనంతపురం అనే పదాన్ని సరిగ్గా పలికాల్సిందిగా ప్రోటీస్ ఆటగాళ్లకు ఛాలెంజ్ విసిరారు. ఇందులో కేశవ్ మహారాజ్, కగిసో రబడా మరియు లుంగి ఎన్గిడి మాత్రమే సరిగ్గా పలికారు. మిగతావాళ్లు నోటికొచ్చిన పేరు చెప్పేశారు. 

అక్టోబరు 05 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ ప్రపంచ కప్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు ఇండియాకు చేరుకుంది. ఇందులో భాగంగా తొలి వార్మప్ మ్యాచ్ ఆడేందుకు తిరువనంతపురం వచ్చింది ప్రోటీస్ జట్టు. శుక్రవారం దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్  వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. సోమవారం న్యూజిలాండ్‌తో ప్రోటీస్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. కుటుంబ కారణాల వల్ల కెప్టెన్ టెంబా బావుమా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. 

Also Read: Anushka Sharma Pregnancy: గుడ్ న్యూస్.. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News