Sunrisers Hyderabad Vs Mumbai Indians Playing 11 and Toss Updates: ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరుకు సిద్ధమైంది. రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై.. విజయం కోసం ఈ మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమి పాలవ్వగా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది. వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ ద్వారా ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మార్కో జాన్సన్ స్థానంలో జట్టులోకి తీసుకున్నారు. నటరాజన్ ప్లేస్‌లో జయదేవ్ ఉనద్కత్ తుది జట్టులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. లూక్ స్థానంలో క్వేనా మఫాకా వచ్చాడు.
Also Read: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?
"మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. మంచి ట్రాక్ కనిపిస్తోంది. మేము గత మ్యాచ్‌లో పటిష్టంగా ఆడాం. అయితే సరిగ్గా ప్లాన్ చేయలేదు. అదే దెబ్బ తీసింది. ఇంకా 13 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మేము పాజిటివ్‌గా ఉన్నాం. సవాలు కోసం ఎదురు చూస్తున్నాం. ఆటగాళ్లందరితో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాను. జట్టులో ఒక మార్పు చేశాం. లూక్ తప్పుకున్నాడు. మఫాకా జట్టులోకి వచ్చాడు." అని ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా తెలిపాడు.
"మంచి వికెట్‌గా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినందుకు పెద్దగా బాధపడలేదు. ఇది కఠినమైన టోర్నమెంట్. ఇక్కడ ప్రేక్షకులు, పరిస్థితులు సహాయపడతాయి. జట్టులో కొన్ని మార్పులు చేశాం. జాన్సెన్ స్థానంలో హెడ్ జట్టులోకి వచ్చాడు. నటరాజన్ స్థానంలో ఉనద్కత్ వచ్చాడు. మాకు గొప్ప జట్టు ఉంది. ఈ రాత్రి ఆడుతున్న 11 లేదా 12 మంది ఆటగాళ్లు తమ సర్వస్వం అందించాలి.." అని ఎస్‌ఆర్‌హెచ్ పాట్ కమిన్స్ తెలిపాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.
Also Read: Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter