Srilanka Women Cricketers Dance: ఈ డ్యాన్స్ చూస్తే ..వీళ్లసలు క్రికెటర్లేనా అన్పిస్తుంది

Srilanka Women Cricketers Dance: విమెన్స్ ఆసియా కప్ 2022 సెమీ ఫైనల్స్‌లో శ్రీలంక జట్టు పాకిస్తాన్‌పై సాధించిన విజయం తరువాత ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే క్రికెటర్లేనా అన్పిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2022, 09:10 PM IST
Srilanka Women Cricketers Dance: ఈ డ్యాన్స్ చూస్తే ..వీళ్లసలు క్రికెటర్లేనా అన్పిస్తుంది

Srilanka Women Cricketers Dance: విమెన్స్ ఆసియా కప్ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. శ్రీలంక-పాకిస్తాన్ ఏ జట్టునూ తీసిపారేయలేం. ఒకరికొకరు ఆధిపత్యాన్ని సాధించిన మ్యాచ్. చివరికి కేవలం 1 పరుగు తేడాతో శ్రీలంక మహిళల జట్టు విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన విమెన్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులు సాధించింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు టార్గెట్ చేరుకోలేకపోయింది. కానీ చివరి వరకూ పోరాడి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్‌కు చెందిన నష్రా సంధు 3 వికెట్లు తీసి శ్రీలంకను 122 పరుగులకు పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్‌లో పరాజయంతో పాకిస్తాన్ మహిళల జట్టు పూర్తిగా నిరాశకు లోనైంది. పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మారూఫ్ మాత్రమే 42 పరుగులు చేసింది. 

పాకిస్తాన్‌పై విజయం తరువాత శ్రీలంక మహిళా క్రికెటర్లు సందడి చేశారు. మ్యాచ్ అనంతరం స్టేడియం గ్రౌండ్‌లో అందరూ కలిసికట్టుగా డ్యాన్స్ చేశారు. శ్రీలంక మహిళా క్రికెటర్ల చక్కని డ్యాన్స్ , స్టెప్పులు చూస్తే అసలు వీళ్లు క్రికెటర్లా లేక డ్యాన్సర్లా అన్పిస్తుంది. అంత చక్కగా తీన్‌మార్ స్టెప్పులతో సందడి చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీలంక ఇప్పుడు విమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్‌లో అక్టోబర్ 15న ఇండియాతో తలపడనుంది. ఇండియా..థాయ్‌లాండ్ జట్టును 74 పరుగుల  తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. 

Also read: Team India Dance: దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం.. డాన్స్ చేసిన భారత ప్లేయర్స్! అబ్బా అనిపించిన ధావన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News