Lalit Modi 9 years old tweet goes viral words with Sushmita Sen: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు భారత టీ20 లీగ్ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ప్రకటించారు. సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా గురువారం స్వయంగా తెలిపారు. ఇద్దరు కలిసి మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పోటోలను మోదీ షేర్ చేశారు. సుస్మిత తన బెటర్ హాఫ్ అంటూ పరిచయం చేశారు కూడా. అయితే ప్రస్తుతం తాము డేటింగ్‌లోనే ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని స్పష్టం చేశారు.
సుస్మితా సేన్, లలిత్ మోదీ ప్రేమ వ్యవహరం ప్రస్తుతం సోషల్ మీడియాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు, ఎప్పుడు లవ్‌లో పడ్డారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో మోదీ-సుస్మితాకు సంబందించిన ఓ ఓల్డ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాగ్దానాలు మరియు కట్టుబాట్ల గురించి ఇద్దరు మాట్లాడుకున్న పాత ట్వీట్ ఇది. ఆ ట్వీట్‌లో.. మోదీ తన ఎస్ఎంఎస్‌కు సమాధానం ఇవ్వమని సుస్మితను కోరారు. ఈ ట్వీట్ 2013 నాటిది.
లలిత్ మోదీ 2013లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'మంచి పనులకు సమయం పడుతుంది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'లలిత్ మోదీ రిప్లై కోసం 9 సంవత్సరాలు వేచి చూశారు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'చివరిగా 9 ఏళ్ల తర్వాత రిప్లై వచ్చింది', 'సహనానికి పరీక్ష అంటే ఇదే', 'లేటు వయసులో ఘాటు ప్రేమ' , '9 ఏళ్లకు కనుకరించిన సుస్మితా సేన్' అంటూ అభిమానులు జోకులు పేల్చుతున్నారు. అంతేకాదు ఇద్దరు ఫొటోలపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
@thesushmitasen reply my SMS
— Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013
లలిత్ మోదీకి గతంలో మినాల్ మోదీతో వివాహమైంది. ఈ జంట 1991 అక్టోబర్ 17న ముంబైలో వివాహం చేసుకుకుంది. క్యాన్సర్ కారణంగా మినాల్ మోదీ 2018 డిసెంబర్‌లో మరణించారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో భారత దేశం విడిచి పారిపోయిన మోదీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు. మరోవైపు సుస్మితా సేన్ ఇదివరకు తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తో డేటింగ్ చేశారు. అయితే కొన్ని కారణాలతో వాళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
@thesushmitasen reply my SMS
— Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013
Waited 9 years 😳
— Naina (@Na1naaa) July 14, 2022
Also Read: మరోసారి విరాట్ కోహ్లీ విఫలం.. అండగా నిలిచిన పాకిస్తాన్ కెప్టెన్! ఏమన్నాడంటే
Also Read: ఎన్నిసార్లు చెప్పాలంటూ.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రోహిత్ శర్మ! అసలు విషయం ఏంటంటే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.