Hurricane Beryl in Barbados: తుపానులో చిక్కుకున్న టీమ్ ఇండియా, ఇవాళైనా వస్తారా

Team India stranded in Barbados: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజేత టీమ్ ఇండియా వెస్ట్‌ఇండీస్‌లో చిక్కుకుపోయింది. బార్బడోస్ పెను తుపానులో టీమ్ ఇండియా సభ్యులు ఇరుక్కుపోయారు. బార్బడోస్ పరిస్థితులపై బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 2, 2024, 08:33 AM IST
Hurricane Beryl in Barbados: తుపానులో చిక్కుకున్న టీమ్ ఇండియా, ఇవాళైనా వస్తారా

Team India stranded in Barbados: టీ 20 ప్రపంచకప్ 2024 గెలిచిన తరువాత మాతృభూమిలో అభిమానుల నీరాజనాలు అందుకోవల్సిన టీమ్ ఇండియా సభ్యులు టైటిల్ గెలిచిన చోటే చిక్కుకుపోయారు. హరికేన్ తుపాను కారణంగా నిన్నట్నించి హోటల్‌లోనే బందీలుగా ఉండిపోయారు. 

జూన్ 29న బార్బడోస్ వేదికగా ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగింది. విశ్వ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా విజయగర్వంతో ఇండియాకు చేరాల్సి ఉంది. అంతలో బార్బడోస్‌లో తుపాను ప్రారంభమైంది. ప్రచండ గాలులు, భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో విమానాశ్రయాలు మూతపడ్డాయి. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయం తిరిగి ఎప్పుడు తెర్చుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో ఇండియాకు బయలుదేరాల్సిన టీమ్ ఇండియా ఫ్లైట్ రద్దయింది. 

బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్ ఇండియా సభ్యుల యోగక్షేమాల్ని బీసీసీఐ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. సభ్యుల్ని క్షేమంగా ఇండియా తీసుకొచ్చేందుకు అన్ని మార్గాల్ని పరిశీలిస్తోంది. విమానాశ్రయాలు మూసివేసి ఉండటంతో ఆలస్యమౌతోంది. విమానాశ్రయాలు తెరిచిన వెంటనే టీమ్ ఇండియా సభ్యుల్ని ప్రత్యేక విమానంలో అక్కడ్నించి అమెరికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అమెరికా నుంచి నేరుగా న్యూ ఢిల్లీకు తీసుకురావచ్చు. 

ఇవాళ మంగళవారం జూలై 2న కూడా బార్బడోస్‌లో తుపాను పరిస్థితి అలాగే ఉంది. ఇంకా బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు పడుతున్నాయి. విమానాశ్రయాల్లో నీరు ఇంకా నిలిచిపోయింది. దాంతో విమానాశ్రయాలు ఇంకా తెర్చుకోలేదు. గాలులు, వర్షాలు తగ్గితేనే ఏదైనా సాధ్యం కావచ్చు. ప్రకృతి ప్రతికూలంగా ఉన్నప్పుడు అక్కడ్నించి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం మంచిది కాదనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. 

Also read: BCCI Prize Money: భారత జట్టుపై బీసీసీఐ కనకవర్షం.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News