Krunal Pandya Twitter Account: టీమిండియా స్టార్ క్రికెటర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హ్యాకర్ ఏం డిమాండ్ చేశాడో తెలుసా?!!

Krunal Pandya's Twitter account hacked: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 01:29 PM IST
  • కృనాల్ పాండ్యా,ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
  • అకౌంట్‌ని అమ్మేయబోతున్నట్లు పాండ్యాలా ట్వీట్
  • హ్యాకర్ ఏం డిమాండ్ చేశాడో తెలుసా?
Krunal Pandya Twitter Account: టీమిండియా స్టార్ క్రికెటర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హ్యాకర్ ఏం డిమాండ్ చేశాడో తెలుసా?!!

Krunal Pandya's Twitter account hacked: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా (Krunal Pandya) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. గురువారం ఉదయం నుంచి పాండ్యా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పలు రకాల ట్వీట్లు వస్తున్నాయి. గురువారం ఉదయం అతని అకౌంట్‌ని హ్యాక్ చేసిన హ్యాకర్ (Hacker).. బిట్‌కాయిన్స్ కోసం ఈ అకౌంట్‌ని అమ్మేయబోతున్నట్లు పాండ్యాలా ట్వీట్ చేశాడు. ఈరోజు ఉదయం సుమారుగా 7:31 నిమిషాలకు పాండ్యా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మొదటి ట్వీట్ పోస్ట్ అయినట్టు తెలుస్తోంది. 

గురువారం ఉదయం కృనాల్ పాండ్యా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మొత్తం 10 ట్వీట్లని హ్యాకర్ పోస్ట్ (Krunal Pandya Twitter Account Hacked) చేశాడు. బిట్‌కాయిన్స్ (Bitcoins) కోసం ఈ అకౌంట్‌ని అమ్మేయబోతున్నట్లు ట్వీట్ చేసిన పోస్ట్ పెద్ద సంచలంగా మారింది. ఈ పోస్టుపై కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఈ అకౌంట్ కోసం ఓ నెటిజన్ స్పందించగా.. అతడిని క్రిప్టో‌కరెన్సీ పంపాల్సిందిగా హ్యాకర్ కోరాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కృనాల్.. సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశాడు.

Also Read: Virat Kohli - Brett Lee: అది పూర్తిగా విరాట్ కోహ్లీ నిర్ణయమే.. కాలమే సమాధానం చెపుతుంది: బ్రెట్ లీ

ఇటీవలి కాలంలో రాజకీయ, సినీ, క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కి గురవుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌‌ని హ్యాకర్స్ హ్యాక్ చేశారు. 2021 అక్టోబరులో టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని హ్యాక్ చేశారు. ఇప్పుడు కృనాల్ పాండ్యా ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయింది. తన ట్విట్టర్ అకౌంట్‌లో వచ్చిన పోస్టింగ్స్‌‌ని నమ్మొద్దని కృనాల్ కోరారు. 

Also Read: Rajinikanth: తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్న ర‌జ‌నీకాంత్.. కారణం ఏంటంటే?

భారత్ తరఫున కృనాల్ పాండ్యా 5 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. గత ఏడాది జులైలో చివరిగా శ్రీలంకపై మ్యాచ్‌లు ఆడిన కృనాల్.. విజయ్  హజారే ట్రోఫీ 2022లో బరోడాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 12, 13న జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి అతడు వస్తున్నాడు. సుదీర్ఘకాలం ముంబై ఇండియన్స్‌ జట్టుకి ఆడిన కృనాల్.. ఇటీవల ఆ ఫ్రాంఛైజీ వేలానికి వదిలేసింది. 2018లో ముంబై రూ.8.8 కోట్లకి పాండ్యాని రిటైన్ చేసుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News