Azharuddin vs Harish rao match: బౌలింగ్ అజహరుద్దీన్..బ్యాటింగ్ హరీష్‌రావు, మీరూ చూస్తారా

Azharuddin vs Harish rao match: టీమ్ ఇండియా మాజి కెప్టెన్ అజహరుద్దీన్ బ్యాటింగ్ గానీ..బౌలింగ్ గానీ ఎంతమందికి గుర్తుంది. అదే అజహరుద్దీన్, మంత్రి హరీష్‌రావు కలిసి క్రికెట్ ఆడితే. అదే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా నిర్వహించిన వేడుకల్లో అజహరుద్దీన్, హరీష్‌రావుల క్రికెట్ చూడముచ్చటగా సందడిగా సాగింది.

Last Updated : Feb 17, 2021, 11:18 PM IST
Azharuddin vs Harish rao match: బౌలింగ్ అజహరుద్దీన్..బ్యాటింగ్ హరీష్‌రావు, మీరూ చూస్తారా

Azharuddin vs Harish rao match: టీమ్ ఇండియా మాజి కెప్టెన్ అజహరుద్దీన్ బ్యాటింగ్ గానీ..బౌలింగ్ గానీ ఎంతమందికి గుర్తుంది. అదే అజహరుద్దీన్, మంత్రి హరీష్‌రావు కలిసి క్రికెట్ ఆడితే. అదే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా నిర్వహించిన వేడుకల్లో అజహరుద్దీన్, హరీష్‌రావుల క్రికెట్ చూడముచ్చటగా సందడిగా సాగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు ( Telangana cm kcr birthday celebrations )వాడవాడలా ఘనంగా జరిగాయి. ఓ వైపు కోటి వృక్షార్ఛన మరోవైపు విభిన్న రకాల సంబరాలు. కేసీఆర్ మేనల్లుడు , మంత్రి హరీష్‌రావు సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ( Cm kcr cricket trophy ) నిర్వహించారు. గత పదిరోజులుగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా మాజి కెప్టెన్ అజహరుద్దీన్, మంత్రి హరీష్‌రావులు పాల్గొన్నారు. స్వతహాగా హరీష్‌రావుకు క్రికెట్ ఆసక్తి ఉండటంతో ఇద్దరూ కలిసి కాస్సేపు క్రికెట్ ఆడారు. సందడి చేశారు. 

అజహరుద్దీన్ ( Azharuddin ) బౌలింగ్ వేయగా..మంత్రి హరీష్‌రావు కాస్సేపు బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరి కలిసి కాస్సేపు క్రికెట్ ఆడటంతో టోర్నమెంట్ సందడిగా సాగింది. అందర్నీ ఆకట్టుకుంది. మ్యాచ్ విరామ సమయంలో మంత్రి హరీష్‌రావు, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కలిసి కాస్సేపు క్రికెట్ ఆడి..అందర్నీ అలరించారు. తరువాత హరీష్‌రావు ( Harish rao )బౌలింగ్ వేయగా..అజహరుద్దీన్ బ్యాటింగ్ చేసి అలరించారు. ఇద్దరి క్రికెట్ మ్యాచ్ చూసి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు, టీఆర్ఎస్ ( TRS ) కార్యకర్తలు ఈలలు, కేకలతో హడావిడి చేశారు. కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్‌లో  ఎంసీసీ యూత్, ఇండియన్ టీమ్ 05 జట్లు తలపడగా..ఎంసీసీ యూత్ ట్రోఫీ కైవసం చేసుకుంది. 

Also read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ వేలానికి సర్వం సిద్ధం, ఎక్కువ డబ్బుతో పంజాబ్ ఫ్రాంచైజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News