Team India: గంభీర్ కోచింగ్‌లో టీమ్ ఇండియా ఎందుకు విఫలమౌతోంది, కోచ్ మారాల్సిందేనా

Team India: క్రికెట్ ప్రస్థానంలో టీమ్ ఇండియా ర్యాంకింగ్ పడిపోతోంది. గతమెంతో ఘనం అని చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ర్యాంకింగ్ పడిపోవడం ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2024, 12:44 PM IST
Team India: గంభీర్ కోచింగ్‌లో టీమ్ ఇండియా ఎందుకు విఫలమౌతోంది, కోచ్ మారాల్సిందేనా

Team India: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగిస్తుండగా ప్రపంచ టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో టీమ్ ఇండియా స్థానం కిందకు జారుతోంది. దాంతో టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ సామర్ధ్యంపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

కంగారూల గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా పరిస్థితి ఘోరంగా మారింది. పరుగులు సాధించడంలో అలసిపోతున్నారు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయలేకపోతున్నారు. ఇప్పటికే రెండు టెస్టుల్లో పరాజయంతో సిరీస్ 2-1 ఆధిక్యంతో ఆసీస్ ఉంది. ఇక మిగిలిన టెస్ట్‌లో విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే సిరీస్ చేజార్చుకుని టెస్ట్ క్రికెట్‌లో ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకోనుంది. వాస్తవానికి ఆరు నెలల క్రితం వరకూ  క్రికెట్‌లో టీమ్ ఇండియా మంచిస్థానంలో ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ కౌచ్‌గా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి మారింది. 

ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలలో జరిగిన వన్డే సిరీస్‌ను 2-0తో శ్రీలంక చేతిలో కోల్పోయింది. 45 ఏళ్లతో తొలిసారిగా టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తరువాత సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. 2012 నుంచి స్వదేశంలో జరిగిన అన్ని టెస్టుల్లో విజయం సాధించిన టీమ్ ఇండియాకు బ్రేక్ పడింది. వరుసగా బెంగళూరు, పూణే, ముంబై టెస్టుల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియా రెండు టెస్టుల్లో ఓడిపోగా ఒక టెస్ట్‌లో విజయం సాధించింది. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు చివరి టెస్ట్‌లో విజయం సాధిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే సిరీస్ కోల్పోవడం ఖాయంం.

ఇది టీమ్ ఇండియా ఆటగాళ్ల వైఫల్యమా లేక కోచ్ గంభీర్ వ్యూహలోపమా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా గంభీర్‌కు బీసీసీఐ మరి కొంత సమయం కచ్చితంగా ఇవ్వచ్చు. ఆలోగా గంబీర్ తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకోలేకపోతే టీమ్ ఇండియాకు మరో కోచ్ వెతకాల్సిందే. 

Also read: Flight Luggage Rules: కొత్త విమానం లగేజ్ రూల్స్ , ఎన్ని ఎలాంటి బ్యాగ్‌లకు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News