T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌నకు ఇటీవల టీమిండియా జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. టీమ్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఆటగాళ్ల ఎంపిక సరిగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో జట్టు ఎంపికపై తొలిసారి అతడు స్పందించాడు. జాతీయ జట్టులో చోటు దక్కడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయమన్నాడు.
టీమిండియా తరపు ఆడాలంటే చాలా సవాళ్లు ఉంటాయన్నాడు. జట్టు ఎంపిక విషయంలో తీవ్రమైన పోటీ ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు..తుది జట్టులోకి వెళ్లాలంటూ తీవ్ర పోటీ ఉండక తప్పదన్నాడు. ఇలాంటివి జరిగినప్పుడు..తనపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమన్నాడు సంజూ శాంసన్. ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించానని..త్వరలో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. మ్యాచ్‌లో ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఒక స్థానానికే పరిమితం కావొద్దని..తాను ఓపెనర్ అని..తాను ఫినిషర్ అని ఎప్పుడు చెప్పుకోవద్దని సంజూ శాంసన్ అన్నాడు. గత మూడు నాలుగేళ్ల నుంచి తాను వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నానని స్పష్టం చేశాడు. ఇలా చేయడం వల్ల తన ఆటలో కొత్త కోణం బయటకు వచ్చిందన్నాడు.
తాను ఏ ఆర్డర్‌లోనైనా ఆడగలనన్న నమ్మకం వచ్చిందన్నాడు సంజూ శాంసన్. ప్రస్తుం సంజూ శాంసన్ భారత్ ఏ జట్టుకు ఆడుతున్నాడు. జూనియర్ జట్టుకు కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇవాళ్టి నుంచి చెన్నై వేదికగా న్యూజిలాండ్ ఏ జట్టుతో భారత్ జట్టు తలపడనుంది.
You can't tell people 'I am an opener or I am a finisher': @IamSanjuSamson
Read: https://t.co/ltNUd9oNCB pic.twitter.com/YPpogf6rwn
— TOI Sports (@toisports) September 21, 2022
Also read:Corona Updates in India: దేశంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి..? తాజా కేసులు ఎన్నంటే..!
Also read:IND vs AUS: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో పోలీసుల లాఠీఛార్జ్..ఓ మహిళ మృతి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.