సెమీస్‌లో టీమిండియా ఫ్లాప్ షో సాగిందిలా ..ఆ రనౌట్ కొంపముంచింది !

వరల్డ్ కప్ సెమీస్ లో కోహ్లీసేన ఓటమి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది

Last Updated : Jul 10, 2019, 09:39 PM IST
సెమీస్‌లో టీమిండియా ఫ్లాప్ షో సాగిందిలా ..ఆ రనౌట్ కొంపముంచింది !

మాంచెస్టర్ లో జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో కివీస్ జట్టు చేతిలో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. క్షమశిక్షణతో కూడిన బౌలింగ్ తో కివీస్ కు కోహ్లీసేన 239 పరుగులకే కట్టడి చేందింది. అంత వరకు బాగుంది. టార్గెట్ 240 మాత్రమే.. పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాకు ఇదేం లెక్క అనకున్నారు అందరూ. అయితే టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం కాగానే కు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. చివరకు భారత అభిమానుల ఆశలు అడిఆశలయ్యాయి.

కుప్పకూలిన టాప్ ఆర్డర్
మ్యాచ్ బిగినింగ్ లో టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకనొక దశలో 4 ఓవర్లు..6 పరుగులు.. ( రోహిత్ 1, కోహ్లీ 1, లోకేష్ 1) 3 కీలక వికెట్లు కుప్పకూలాయి. కొంత గ్యాప్ తర్వాత 10 ఓవర్లో 24 స్కోర్ వద్ద దీనేష్ కార్తీక్ ఔట్.. దీంతో నాలుగు వికెట్లు కోల్పయింది. కాసేపు పంత్, పాండ్యా జోడి పోరాడారు. ఈ జోడి ఆడుతున్నంత సేపు మ్యాచ్ పై ఆశలు చిరుగురిస్తూ వచ్చాయి. ఇంతలో దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ (32 ) 22.5 ఓవర్ లో ఔట్ అప్పటికి భారత్ స్కోర్ 71-5. దీంతో అభిమానుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.

జడేజా మెరుపులు

సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగాడు ధోనీ.. కొంత సేపు ధోనీతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు పాండ్పా ప్రయత్నించాడు. అయితే  92 పరుగుల వద్ద పాండ్యా (32) ఔట్ అప్పటికీ భారత్ స్కోర్  30.3 ఓవర్లలో 92-6. సరిగ్గా అప్పడే జడేజా రంగంలోకి దిగాడు. క్రీజులో ధోనీతో జతకట్టి మంచి విజయానికి కావాల్సిన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరి వరకు పోరాడిన ఈ జోడీ స్కోర్ బోర్డును 208 పరుగుల వరకు లాక్కొచ్చారు. అప్పటి వరకు మెరుపులు మెరిపించిన జడేజా (75)  47.5వ ఓవర్లో ఔట్.. విజయానికి సరిగ్గా 31 పరుగుల అవసరం ఉంది. మిగిలి ఉంది 13 బంతులు మాత్రమే.

ధోనీ ఔట్ తో ఆశలు గల్లంతు
క్రీజులో మ్యాచ్ ఫినిషర్ ధోనీ ఉన్నాడగా అన్న ధీమా అభిమానుల్లో ఉంది..విజయంపై  ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇంతలో ధోనీ ఓ సూపర్ సిక్స్...దీంతో అతని వ్యక్తిగత స్కోర్ హాఫ్ సెంచరీ. అభిమానుల్లో కేరింతలు మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న ధోనీ భారత్ ను విజయ తీరాలను చేర్చుతాడనే నమ్మకం ఏర్పాడింది.. ఇంతలో అనూహ్య రీతిలో .48.3 ఓవర్లో  ధోనీ రనౌట్. ఇదే మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ధోనీ (50) తొమ్మిదో వికెట్ గా ఔట్ కావడంతో ఇక విజయంపై టీమిండియా అభిమానులు విజయంపై ఆశలు వదులుకున్నారు. 

ఓటమిని అంగీకరించిన కోహ్లీసేన
అప్పటికే భారత్ స్కోర్ 48.3 ఓవర్లలో స్కోర్ 217-9. ఇలా తడబడుతూ మొదలైన కోహ్లీసేన ఆట తీరు మధ్యలో మెరిసినా చివర్లో మళ్లీ తడబడి ఓటమి పాలైంది. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి  221 మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది.  టీమిండియా పరాజయాన్ని అభిమానులకు జీర్ణించుకోలేపోతున్నారు. బ్యాడ్ లక్.

Trending News