SRH vs KKR: అంపైర్ పొరపాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అవకాశం

SRH vs KKR: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా..క్రికెట్‌లో సాంకేతికత ఎంతగా వచ్చి చేరినా పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి జరిగిన తప్పుు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2022, 12:08 PM IST
  • ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటు
  • పవర్ ప్లే తరువాత అవుట్ ఫీల్డ్‌లో ఐదుగురు ఫీల్డర్లు
  • అంపైర్ గమనించకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రయోజనం
SRH vs KKR: అంపైర్ పొరపాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అవకాశం

SRH vs KKR: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా..క్రికెట్‌లో సాంకేతికత ఎంతగా వచ్చి చేరినా పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి జరిగిన తప్పుు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చింది.

క్రికెట్‌లో గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. గతంలో లేని పవర్ ప్లే ఇప్పుడుంది. ఏ ఫీల్డ్‌లో ఎంత మంది ఫీల్డర్లు ఏ ఓవర్లలో ఉండాలనేది ఓ స్పష్టత ఉందిప్పుడు. అటు అవుట్ విషయంలో అత్యాధునిక కెమేరాల సహాయంతో నిర్ణయాలు రివ్యూ చేసే పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ పొరపాట్లు జరుగుతున్నాయి. తప్పుడు నిర్ణయాలు కొన్ని జట్లను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంపైర్ తప్పుడు నిర్ణయం ఆ జట్టుకు కలిసొచ్చింది. అదేంటో చూద్దాం.

టీ20 క్రికెట్‌లో పవర్ ప్లే ముగిసిన తరువాత అంటే తొలి ఆరు ఓవర్ల తరువాత అవుట్ ఫీల్డ్‌లో నలుగురే ఫీల్డర్లు ఉండాలి. మిగిలినవారంతా 30 గంజాల సర్కిల్స్‌లో ఉండాలి. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్ సమయంలో ఉమ్రాన్ మాలిక్ అవుట్ ఫీల్డ్‌లో ఐదవ ఫీల్డర్‌గా ఉన్నాుడు. అప్పటికే బౌలర్ బంతి వేయడం, బ్యాట్స్‌మెన్ పరుగు తీసుకోవడం రెండూ జరిగిపోయాయి. ఈ విషయాన్ని కామెంటేటర్ గమనించినా..ఎంపైర్ గమనించలేకపోయాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చినట్టైంది. మ్యాచ్ లో కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్ డౌల్ నో బాల్ అంటూ స్పష్టంగా చెబుతున్నా..ఎంపైర్ గమనించలేదు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎంపైర్ ఏ మాత్రం గుర్తించినా కచ్చితంగా నో బాల్ చెప్పేవాడే. నో బాల్స్, వైడ్‌బాల్స్ వైడ్స్, లెగ్‌బై, రనవుట్స్, ఫోర్లు, సిక్సర్లు, ఆటగాళ్లను నియంత్రించడం అంతా ఫీల్డ్ అంపైర్‌దే బాధ్యత. బహుశా ఆ ఒత్తిడిలో ఈ ఓవర్ ది రూల్ గమనించలేనట్టుంది. 

Also read: RR vs GT: రాజస్తాన్‌తో గుజరాత్‌ ఢీ.. టేబుల్ టాపర్‌ను హార్దిక్ టీమ్ ఓడిస్తుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News