Javed Miandad vs Venkatesh Prasad: టీమిండియా పాకిస్తాన్లో పర్యటించకపోవడంపై బిసిసిఐ తీరును తప్పుపడుతూ నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ కెప్టేన్ మియాందాద్ చెంప ఛెళ్లుమనిపించాడు టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్. ఆసియా కప్ 2023 విషయంలో పాకిస్థాన్‌లో ఆడేందుకు సుముఖత చూపించని బిసిసిఐ గురించి జావేద్ మియాందాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కాకుండా మరో న్యూట్రల్ వేదికను ఏర్పాటు చేయాలని.. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదని బిసిసిఐ తరపున ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జే షా గతేడాదే స్పష్టంగా తేల్చిచెప్పాడు. మార్చి నెలలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటి రెండోసారి భేటీ కానుంది. ఈ భేటీలోనే ఆసియా కప్ 2023 వేదికపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే విషయమై సోమవారం ఒక పబ్లిక్ ఈవెంట్ లో జావేద్ మియాందాద్ మాట్లాడుతూ బీసీసీఐపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకున్నాడు.
పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమిండియా రానంత మాత్రాన్నే పాకిస్థాన్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదని.. పాకిస్థాన్‌కి వచ్చే అవకాశాలు ఆగిపోవడం లేదన్న జావేద్ మియాందాద్... టీమిండియా పాకిస్థాన్‌కి వస్తుందా రాదా అనే విషయాలు చూసుకోవడం ఐసిసి పని అభిప్రాయపడ్డాడు. ప్రతీ జట్టు ప్రతీ చోటుకు వెళ్లాల్సిందేనని.. అలా మాట వినని జట్లను నియంత్రించడానికి ఐసిసి ఉందని అన్నాడు. ఏ దేశమైనా మాట వినకపోతే.. వాళ్లు ఎంత స్ట్రాంగ్ జట్టు అయినా సరే వారిని ఐసిసి లోంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. అంతటితో సరిపెట్టుకోని జావేద్ మియాందాద్.. పాకిస్థాన్‌లో ఆడటానికి బీసీసీఐ ఎందుకు ఆసక్తి చూపించడం లేదంటే.. ఒకవేళ పాకిస్థాన్‌లో టీమిండియా ఓడిపోతే.. స్వదేశంలో జనం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఊహించుకోలేకే బీసిసిఐ పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించడం లేదని కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చేసే క్రమంలోనే " టీమిండియా పాకిస్తాన్‌కి రాకపోతే గో టూ హెల్ " అంటూ ఇంగ్లీష్ నానుడిని కూడా ఉపయోగించాడు.
But they are refusing to go to hell :) https://t.co/gX8gcWzWZE
— Venkatesh Prasad (@venkateshprasad) February 6, 2023
జావేద్ మియాందాద్ చేసిన ఇదే వ్యాఖ్యలపై వెంకటేష్ ప్రసాద్ స్పందిస్తూ.. వాళ్లు ( టీమిండియా ) నరకానికి వెళ్లడానికి సిద్ధంగా లేరని వ్యంగ్యంగా బదులిచ్చాడు. " టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ఎందుకు రావడం లేదని డిమాండ్ చేస్తూనే గో టు హెల్ " అని జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలనే తిప్పికొడుతూ పాకిస్థాన్ కూడా నరకం లాంటిదేనని.. అందుకే అక్కడికి రావడానికి తమ ఆటగాళ్లు సిద్ధంగా లేరని జావేద్ మియాందాద్ చెంప ఛెళ్లుమనేలా వెంకటేష ప్రసాద్ బదులిచ్చాడు. వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Virat Kohli Lost Phone: ఫోన్ పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ.. అనుష్క ఫోన్ నుంచి ఆర్డర్ చేయమన్న జొమాటో!
ఇది కూడా చదవండి : Aaron Finch: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్!
ఇది కూడా చదవండి : Virat Kohli Record: మరో 64 పరుగులే.. క్రికెట్లో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ! సచిన్ కూడా వెనకాలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook