అక్కడ సెలబ్రిటీ కాదు.. సామాన్యుడు..!

బాలల కోసం ఏర్పాటు చేసిన ఒక సైన్స్ ఎగ్జిబిషన్‌లో తన పిల్లలతో కలిసి ఒక తండ్రిగా,  చాలా సాధారణమైన వ్యక్తిగా ఎలాంటి బేషజాలు లేకుండా కలియతిరిగిన, రాహుల్ ద్రావిడ్‌ని పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Last Updated : Nov 25, 2017, 06:22 PM IST
అక్కడ సెలబ్రిటీ కాదు.. సామాన్యుడు..!

ఒక సెలబ్రిటీ అంటే కనీసం ఇద్దరు బాడీగార్డులు లేదా బౌన్సర్లు ఉండాలి.. అంతే కాదు.. వారు ఎక్కడికి వెళ్లినా సాధారణ పౌరులతో కలిసి మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. అయితే రాహుల్ ద్రావిడ్ మాత్రం ఈ సంప్రదాయానికి తెరదించుతూ పలువురిని ఆశ్చర్యపరిచాడు. ఒక ఎగ్జిబిషన్‌కి చాలా సాధారణమైన వ్యక్తిలా వెళ్లి క్యూలో నిలుచున్నాడు. అతన్ని చూసి నిర్వాహకులు స్పెషల్‌గా రిసీవ్ చేసుకోవడానికి  వచ్చినా.. వారించి లైనులో నిలబడి తన వంతు వచ్చాక అందరిలాగానే టికెట్ తీసుకున్నారు.

 

 

బాలల కోసం ఏర్పాటు చేసిన ఒక సైన్స్ ఎగ్జిబిషన్‌లో తన పిల్లలతో కలిసి ఒక తండ్రిగా,  చాలా సాధారణమైన వ్యక్తిగా ఎలాంటి బేషజాలు లేకుండా కలియతిరిగిన, రాహుల్ ద్రావిడ్‌ని పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతని సింప్లిసిటీకి ఫిదా అయినట్లు ట్వీట్లు కురిపిస్తున్నారు. పేజ్ త్రీ యాటిట్యూడ్ లేని ఒక నిజాయతీగల వ్యక్తని.. సెలబ్రిటీ గాలి తగలని సామాన్యుడు ద్రావిడ్ అని ఇప్పటికే పలువురు చేసిన ట్వీట్‌లు వైరల్ అయ్యాయి.

ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ద్రావిడ్ 1991లో రంజీ ట్రోఫీతో క్రికెట్ ఆటగాడిగా తన కెరీర్ ప్రారంభించారు.  తన కెరీర్‌లో 136 టెస్టులు, 339 వన్డేలు ఆడారు. 2008లో టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని అధికమించాడు. అలాగే వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన రికార్డు కూడా ద్రావిడ్ పేరు మీదే ఉంది. వికెట్ కీపర్‌గా ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ కూడా ద్రావిడే.  2004లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుచే సత్కరించబడ్డాడు.

 

 

 

Trending News