భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి వార్తల్లో ఎక్కారు. భారతీయ విద్యా విధానంలో పుస్తకాల ద్వారా చిన్నారులకు ఏం చెప్పదలుచుకున్నారంటూ సెహ్వాగ్ విమర్శించారు. పాఠ్య పుస్తకాల ముద్రణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పాఠశాల పుస్తకంలో ఉన్న వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంబంధిత కాపీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'పెద్ద కుటుంబం అంటే తల్లిదండ్రులు, తాత, నానమ్మలతో పాటు చాలా మంది పిల్లలు ఉంటారు. అటువంటి కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వలేదు' అని ఉండటంతో వాటిని 'చెత్త'గా పరిగణిస్తూ అధికారులు వాటిని పరిశీలించాలని కోరారు.
A lot of such crap in school textbooks. Clearly the authorities deciding and reviewing content not doing their homework pic.twitter.com/ftaMRupJdx
— Virender Sehwag (@virendersehwag) August 5, 2018
భారతీయ విద్య వ్యవస్థను ప్రశ్నించిన సెహ్వాగ్‌కు సోషల్ మీడియాలో మద్దతు లభించింది. పిల్లల కంటే ముందు స్కూళ్లు ఎడ్యుకేట్ అవ్వాలని కొందరు నెటిజన్లు విమర్శించారు. అంతకుముందు సెహ్వాగ్ ట్విట్టర్లో కాషాయ దుస్తులేసుకుని, మెడలో రుద్రాక్షాలను ధరించి ఉన్న ఫోటోను పోస్టు చేశారు.
Guru karna jaan kar, Paani peena chaan kar .
Jai Bhole ! Jai Shri Ram ! Jai Bajrangbali ! pic.twitter.com/9utbMVP08z— Virender Sehwag (@virendersehwag) August 3, 2018
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం సెహ్వాగ్ వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నారు. తాజాగా సెహ్వాగ్ టీ10 క్రికెట్ లీగ్‌లో మరాఠా అరేబియన్స్ జట్టు బ్యాటింగ్ కోచ్ బాధ్యతల్ని చేపట్టనున్నారని తెలిసింది. ఈ లీగ్ రెండో సీజన్ నవంబర్‌లో జరగనుంది.