IND Playing XI vs NZ: సంజూ శాంసన్‌కు దక్కని చోటు.. వసీం జాఫర్‌ భారత జట్టు ఇదే!

Wasim Jaffer picks India Playing XI vs New Zealand. భారత్‌ vs న్యూజిలాండ్‌ తొలి వన్డే నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ తన తుది జట్టును ప్రకటించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 24, 2022, 09:04 PM IST
  • భారత్‌ vs న్యూజిలాండ్‌ తొలి వన్డే
  • సంజూ శాంసన్‌కు దక్కని చోటు
  • వసీం జాఫర్‌ భారత జట్టు ఇదే
IND Playing XI vs NZ: సంజూ శాంసన్‌కు దక్కని చోటు.. వసీం జాఫర్‌ భారత జట్టు ఇదే!

Wasim Jaffer picks India Playing XI vs New Zealand 1st ODI: న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మరో సమరానికి సిద్దమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం (నవంబర్ 25) నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. ఆక్లాండ్ వేదికగా రేపు ఉదయం 7 గంటలకు తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాత్కాలికంగా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో యువకులు బరిలోకి దిగనున్నారు. తొలి వన్డే మ్యాచ్‌ నేపథ్యంలో భారత ప్లేయింగ్ ఎలెవన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ తన తుది జట్టును ప్రకటించాడు. 

వసీం జాఫర్‌ తన జట్టుకు శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ను మూడో స్థానంలో, సూర్యకుమార్‌ యాదవ్‌కు నాలుగో స్థానంలో తీసుకున్నాడు. వికెట్‌ కీపర్‌గా జట్టు వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను ఎన్నుకున్నాడు. ఆరో స్థానం కోసం దీపక్‌ హుడాను జాఫర్‌ తీసుకున్నాడు. టీ20 సిరీస్‌లో అవకాశం దక్కని సంజూ శాంసన్‌కు జాఫర్‌ అవకాశం ఇవ్వ్వలేదు. దాంతో భారత ఫాన్స్ మాజీ ఆటగాడిపై మండిపడుతున్నారు. 

ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు వసీం జాఫర్‌ అవకాశమిచ్చాడు. దీపక్‌ హుడా కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. పేస్‌ బౌలర్ కోటాలో దీపర్‌ చహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు చోటు ఇచ్చాడు. ఈడెన్‌ పార్క్‌ బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయని, ఇక్కడ మణికట్టు స్పిన్నర్లు అవసరం ఉండదని జాఫర్‌ స్పష్టం చేశాడు. తొమ్మిదో స్థానంలో వచ్చే చహర్‌ బ్యాటింగ్‌ చేయగల టీమ్ ఇది అని మాజీ ఓపెనర్ తెలిపాడు. 

జాఫర్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌: 
శిఖర్ ధావన్ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, శ్రేయాస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌, దీపక్‌ చహర్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌. 

Also Read: IND vs NZ Weather Update: తొలి వన్డేకు వరణుడి ముప్పు.. ఆక్లాండ్‌లో గత రెండు రోజులుగా..!  

Also Read: Payal Rajput Photos: పొట్టి నిక్కరులో పాయ‌ల్ పాప.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News